Telugu Global
Business

ఏసర్ నుంచి బడ్జెట్ ఇ–బైక్! ఫీచర్లివే

ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ వంటి ప్రొడక్ట్స్‌లో మంచి పేరున్న ఏసర్ కంపెనీ రీసెంట్‌గా ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్ ధరలోనే అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఆఫర్ చేస్తూ కొత్త ఇ–స్కూటర్‌‌ను లాంఛ్ చేసింది.

ఏసర్ నుంచి బడ్జెట్ ఇ–బైక్! ఫీచర్లివే
X

ల్యాప్‌టాప్స్, డెస్క్‌టాప్స్ వంటి ప్రొడక్ట్స్‌లో మంచి పేరున్న ఏసర్ కంపెనీ రీసెంట్‌గా ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్ ధరలోనే అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఆఫర్ చేస్తూ కొత్త ఇ–స్కూటర్‌‌ను లాంఛ్ చేసింది.

తైవాన్ ఎలక్ట్రానిక్ కంపెనీ అయిన ఏసర్.. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మువి(ఎంయూవీఐ)125 4జీ స్కూట‌ర్‌ను లాంఛ్ చేసింది. దీనికిగానూ ‘థింక్ ఇ– బైక్ గో’ అనే ఇండియన్ కంపెనీతో కలిసి పనిచేస్తుంది. మిగతా ఇ–బైక్స్‌కు పోటీనిచ్చేలా స్కూటర్ ధరను రూ.99,999 గా నిర్ణయించింది. రూ.999 చెల్లించి స్కూటర్ ప్రీబుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. మువి 125 4జీ స్కూటర్.. గరిష్టంగా గంట‌కు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. సింగిల్ ఛార్జ్‌తో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. సిటీలో రోజువారీ అవసరాలకు, ఆఫీసుల‌కు వెళ్లే ఉద్యోగులకు, స్టూడెంట్స్‌కు, ఫుడ్ డెలివ‌రీ, గ్రాస‌రీ డెలివ‌రీ, బీ2బీ అవ‌స‌రాల‌కు ఇది అనువుగా ఉంటుందని కంపెనీ చెప్తోంది.



లైట్ వెయిట్ ఉండే ఈ స్కూటర్‌‌కు 16 ఇంచ్.. 7 స్పోక్ అల్లాయ్ వీల్స్‌ అమర్చారు. స్వాప‌బుల్ బ్యాట‌రీ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే ఇందులో బ్లూటూత్ ఎనేబుల్డ్ 4 ఇంచ్ ఎల్‌సీడీ స్క్రీన్ విత్ త్రీ కాన్ఫిగరేష‌న్స్‌, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, రౌండ్ షేప్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ అబ్జార్బర్ వంటి ఫీచర్లున్నాయి. ఈ స్కూటర్ పొలార్ వైట్‌, కార్బన్ బ్లాక్‌, గ్లాసియ‌ర్ సిల్వర్ అనే మూడు క‌ల‌ర్ ఆప్షన్స్‌లో ల‌భిస్తుంది.



ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓలా ఎస్‌1 ప్రో, ఎథర్ 450, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి ఎల‌క్ట్రిక్ స్కూటర్స్‌కు గట్టి పోటినివ్వనుంది. ఇండియన్ మార్కెట్‌లో ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్స్‌తో పాటు ఎలక్ట్రిక్ త్రీ వీల‌ర్స్ కూడా త‌యారుచేసేందుకు ఏసర్ ప్లాన్ చేస్తోంది.

First Published:  19 Oct 2023 10:30 AM IST
Next Story