Telugu Global
Business

రూ.10 వేలకే 50 మెగా పిక్సల్‌ కెమెరా ఫోన్‌

కొత్త మొబైల్‌ లాంచ్‌ చేసిన పోకో.. బ్యాటరీ లైఫ్‌ కూడా ఎక్కువే

రూ.10 వేలకే 50 మెగా పిక్సల్‌ కెమెరా ఫోన్‌
X

రూ.10 వేలకే 50 మెగా పిక్సల్‌ కెమెరాతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది పోకో సంస్థ. కేవలం కెమెరా కెపాసిటీ మాత్రమే కాదు బ్యాటరీ లైఫ్‌ కూడా ఎక్కువే ఉంటుందని ప్రకటించింది. పోకో ఎం సిరీస్‌ లో ఎం7 5జీ ఫోన్‌లో 50 మెగా పిక్సల్‌ కెమెరా, 5,160 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 6.88 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ ప్లే, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ ఫోర్త్‌ జనరేషన్‌ 2 ప్రాసెసర్‌ అమర్చారు. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత హైపర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ తో ఈ మొబైల్‌ ఫోన్‌ రన్‌ అవుతుంది. 6జీబీ ప్లస్‌ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.9,999 కాగా, 8 జీబీ ప్లస్‌ 128 జీబీ వేరియంట్‌ ధర రూ.10,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈనెల 7వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభిస్తారు. మింట్‌ గ్రీన్‌, సెటైన్‌ బ్లాక్‌, ఓషియన్‌ బ్లూ రంగుల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు.

First Published:  3 March 2025 5:47 PM IST
Next Story