2023 Kawasaki Ninja 300 | మార్కెట్లోకి అప్‌డేటెడ్ కవాసాకి నింజా.. విత్ హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ
2023 Kawasaki Ninja 300 | ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ `కవాసాకి ఇండియా`.. భారత్ మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2023 కవాసాకి నింజా 300 (2023 Kawasaki Ninja 300) తీసుకొచ్చింది.
2023 Kawasaki Ninja 300 | ప్రముఖ జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ `కవాసాకి ఇండియా`.. భారత్ మార్కెట్లోకి అప్‌డేటెడ్ 2023 కవాసాకి నింజా 300 (2023 Kawasaki Ninja 300) తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ.3.43 లక్షల నుంచి మొదలవుతుంది. ఈ మోటారు సైకిల్ అదనంగా మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. శక్తిమంతమైన 300 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. లైమ్, క్యాండీ లైమ్, మెటాలిక్ మూన్ డస్ట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఇంజిన్ హీట్ కూలింగ్ టెక్నాలజీ కూడా అదనపు ఆకర్షణ కానున్నది. రెండో దశ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌డేట్ చేసిన మోటార్ సైకిల్ ఇది.
ఇవీ 2023 కవాసాకి నింజా 300 స్పెషిపికేషన్స్..
టూ వీలర్ టైప్ | స్పోర్ట్స్ |
ఇంజిన్ సీసీ (డిస్ ప్లేస్‌మెంట్) | 296 సీసీ |
గరిష్ట విద్యుత్ | 11,000 ఆర్పీఎం వద్ద 39 హెచ్‌పీ |
గరిష్ట టార్చి | 10వేల ఆర్పీఎం వద్ద 26.1 ఎన్ఎం |
సిలిండర్ల సంఖ్య | 2 |
గేర్ల సంఖ్య | 6 |
సీటు ఎత్తు | 780 ఎంఎం |
గ్రౌండ్ క్లియరెన్స్ | 140 ఎంఎం |
కెర్బ్ వెయిట్ | 179 కిలోలు |
ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ | 17 లీటర్లు |
స్పోర్ట్స్ బైక్స్ ల్లో అత్యంత అప్పీలింగ్ బైక్ న్యూ కవాసాకీ నింజా 300. ఈ బైక్‌లో పలు వసతులు ఉన్నాయి. 296 సీసీ, 4-స్ట్రోక్, పార్లల్ ట్విన్, డీవోహెచ్‌సీ, 8-వాల్వ్ ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ అండ్ ఎక్విప్డ్ విత్ ఫ్యుయల్ ఇంజెక్షన్ తదితర ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. ఈ ఇంజిన్ 26.1 ఎన్ఎం టార్చి, 36 పీఎస్ విద్యుత్ గరిష్టంగా విడుదల చేస్తుంది.
హీట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీతోపాటు టూ-చానెల్ ఏబీఎస్, రేస్ డెరివైడ్ క్లచ్ టెక్నాలజీ ఫర్ స్మూతర్ షిప్ట్స్, బెటర్ ఆటోమైజింగ్ ఇంజెక్టర్లు, డ్యుయల్ థ్రోటిల్ వాల్వులు ఉన్నాయి. హై టెన్సిల్ డైమండ్ చేసిస్, స్లిప్పర్ క్లచ్ అండ్ అసిస్ట్, సెల్ఫ్ సర్వో మెకానిజం, బ్యాక్ టార్చ్ లిమిటర్, షార్ట్ సైలెన్సర్ విత్ సాఫిస్టికేటెడ్ క్రాస్ సెక్షన్, హై స్పీడ్ పెర్పార్మెన్స్ కోసం లీన్ యాంగిల్ తదితర ఆప్షన్లు కూడా జత కలిశాయి.