ప్రకృతే ప్రగతి (కవిత)

ధరిత్రిని
నగరీకరణ అనే ఆధునికతకు
ఆకాశ హర్మ్యాలు నిర్మించి,
వేగంగా కదలడానికి
ఊహకందని, ఊహించలేని రహదారులు
వలయాలను భ్రమించేలా కట్టి ,
కాంక్రీట్ అనే వెచ్చని కంబళిని
భూమికి చీరలా చుట్టి,
ప్రగతిలా మురిసి,
ముచ్చెమటలు పట్టించుకుంటూ ,
తుడుచుకోవడానికి కష్టపడుతూ ,
క్లోరో, ఫ్లోరోకార్బన్ల ఉద్గారాలకు
కారణం అవుతూ,
పర్యవసానాలకు
పరిష్కారాన్వేషణలు అన్వేషిస్తూ ,
ప్రకృతిని చెరబట్టి
ప్రగతి అనే భ్రమలో జీవిస్తూ,
పచ్చని కొండకోనలను
ఖనిజాన్వేషణకు,
పచ్చని పొలాలను
కర్మాగారాలకు బలిస్తూ,
జీవవైవిధ్యాన్ని హరిస్తూ ,
జీవవైవిధ్యాన్ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ,
మనిషి ప్రకృతిలో మమేకమై
సుఖంగా జీవించిన రోజులను
గుర్తు తెచ్చుకుంటూ
సమైక్య జీవన సౌందర్యం లోని గొప్పతనాన్ని
మననం చేసుకుంటూ,
పల్లె జీవనం ప్రగతికి పట్టుకొమ్మ,
జీవ సౌరభారలు వెదజల్లే పూలరెమ్మ. ఇటువంటి జీవనం
తిరిగి రావాలని కోరుకుంటూ.
- వేము విజయ్ కుమార్
(మనుబోలు,నెల్లూరు)