Telugu Global
Arts & Literature

టెన్షన్ ( కథ )

టెన్షన్ ( కథ )
X

ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.

మొగుడు తాగుబోతు, తిరుగుబోతూను.

కుటుంబాన్ని పట్టించుకోడు. ఒక్కగానొక్కపసిబిడ్డకు పాలుకూడా కొని పొయ్యలేనిదుస్థితి. నర్సరీ స్కూల్లో ఆయాగా తెచ్చు కునే నాలుగురాళ్ళూ ఎప్పటికప్పుడు గ్రద్దలాతన్నుకుపోతుంటాడు మొగుడు. కాదంటేవొళ్లంతా కుళ్లబొడుస్తాడు.

ఆకలితో నేలపైన పొర్లి ఏడుస్తున్న పసిదాన్ని చూసి కడుపు తరుక్కుపోయింది.

ఆ పిల్ల ఆకలిచావును కళ్లచూసే ధైర్యం తల్లిమనసుకు లేదు. అందుకే పురుగుమందు తాగేసింది. ఇరుగుపొరుగులు చూసి ఆసుపత్రిలో చేర్చారు ఆమెను.

ఆమె ప్రాణాలను కాపాడేందుకు శాయశ క్తులా ప్రయత్నిస్తున్నాడు డాక్టర్. స్టమక్ వాష్చేసి చాలావరకు విషాన్ని కక్కించాడు.ఇంజెక్షన్లు ఇచ్చాడు.

సరిగ్గా అదే సమయంలో హడావుడిగాఅక్కడికి వచ్చాడతను. ఆమె పరిస్థితినిగురించి ఆత్రుతగా విచారించాడు. తాముచేస్తున్న ప్రయత్నాలను వివరించాడు డాక్టర్.

అతను బయటే కూర్చున్నాడు. గంటగంటకూ డాక్టర్ దగ్గరకెళ్ళి ఆమె సమాచారంఅడుగుతున్నాడు. పరిస్థితిని ఎప్పటికప్పుడు.

వివరిస్తున్నాడు డాక్టరు... ఆమె తెలివిలేకుండా పడివుంది. ఇరవై నాలుగ్గంటలు గడిస్తేగాని ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేనన్నాడు.

సమయం గడిచే కొద్దీ టెన్షన్ ఫీలయిపోతున్నాడతను. ఆమెకు ప్రమాదం తప్పాలని అన్ని మతాల దేవుళ్లకూ మొక్కుకోసాగాడు.

మళ్లీ మళ్లీ డాక్టర్ని ఆమె కండిషన్ గురించి అతను అడుగుతూనే వున్నాడు.డాక్టర్ ఓపికగా జవాబిస్తూనే ఉన్నాడు.

ఆ రాత్రంతాఅతని వదనంలో ఆందోళన కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది. అతని పరిస్థితి చూస్తే జాలివేసింది డాక్టర్స్కి నర్సులకీను. అతనికోసమేనా ఆమె బతికితే బావుండుననిపించింది.

తెల్లవారింది. బల్లపైన కూర్చునికునికిపాట్లు పడుతున్న అతన్ని లేపాడుడాక్టర్. "ఆమెకు తెలివి వచ్చింది. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పింది. మీరు వెళ్ళిచూడవచ్చు" అన్నాడు.

అతని వదనంలోకి కాంతి వచ్చింది.

"థాంక్యూ, థాంక్యూ డాక్టర్!" అంటూ హడావుడిగా ఆమె వున్న గదిలోకి వెళ్లబోయాడు.

అంతవరకూ అణచుకున్న కుతూహలంఒక్కసారిగా బయటకు తన్నుకొచ్చింది డాక్టరికి. అతన్ని ఆపి, "నిన్నట్నుంచీ చూస్తున్నాను. ఆమెకోసం నువ్వు పడుతూన్న ఆందోళన, చూపుతూన్న

ఆతురతాను.ఇంతకూ నువ్వు ఆమెకు ఏమవుతావు?" అనడిగాడు.

"ఏమీ కాను" అన్న అతని జవాబుకి తెల్లబోయాడు డాక్టర్.

"సారీ, డాక్టర్! అసలు విషయం మీకు చెప్పనేలేదు కదూ? కొత్తగా సర్వీసులో చేరిన పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ని నేను.

ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం చేసిందనితెలిసి పరుగెత్తుకొచ్చాను. ఆత్మహత్యాప్రయత్నం చట్టరీత్యా నేరం అన్న సంగతిమీరు ఎరిగినదే. ఆమె బతికినట్లయితే కేసు బుక్ చేద్దామన్నది నా తపన. పైగా నేనుఉద్యోగంలో చేరగానే దొరికిన మొదటికేసిది చేజార్చుకోవడం ఇష్టంలేదు.అందుకే ఆమె బతకాలని అంతగా కోరుకున్నాను...!! '

అతని పలుకులు పూర్తికాకుండానే 'షాక్'తో దబ్బున పడిపోయాడు డాక్టర్.

-తిరుమల శ్రీ

First Published:  27 Feb 2023 1:08 PM IST
Next Story