అసలు స్ధైర్యం (కవిత)
BY Telugu Global21 Nov 2022 12:53 PM IST
X
Telugu Global Updated On: 21 Nov 2022 12:53 PM IST
వృధ్ధాప్యంలోకి రాకముందు
బీరాలు పలుకుతాం
వృధ్ధాప్యాన్ని స్వాగతిస్తామని
అది చేస్తాం .. ఇది చేస్తాం అని
ఆకాశాన్ని దించుతాం
ఆదర్శమవుతామని
కానీ
అసలు సమస్య ఎదురయినప్పుడు
శరీరంలో ఓపిక సన్నగిల్లినప్పుడు
కడుపున పుట్టినవాళ్ళు
వాళ్ళ కడుపున పుట్టినవాళ్ళు
కనుచూపు మేరలో లేనప్పుడు
ఏకాంత రాక్షసి గుబులుని రెచ్చగొడుతున్నప్పుడు
ఏవో వికృత ఆరాటాలు
పోరాటం చేస్తున్నప్పుడు
కరోనాలాంటి సిటీ కల్చర్ బాధిస్తున్నప్పుడు
అప్పుడు కావాలి .. అసలు స్ధైర్యం.
-పి.యస్.యమ్. లక్ష్మి
Next Story