Telugu Global
Arts & Literature

జోకాభిరామాయణం

జోకాభిరామాయణం
X

తప్పకుండా

______

వెంగళప్పతో అతని గర్ల్ ఫ్రెండ్

అంది "మన ఎంగేజ్మెంట్ రోజు

నువ్వు నాకు తప్పక రింగివ్వాలి?"

“అలాగే నీ సెల్ఫోన్ నెంబర్ ఇవ్వు"

అన్నాడు వెంగళప్ప.

పేరు

—————

నాలుగేళ్ల చిన్ని ఇంటికి వాళ్ల నాన్నగారి ఫ్రెండు ఓ పెద్ద కుక్కను వెంటబెట్టుకు

వచ్చారు.

"పాపా! మా కుక్క పేరేమిటో తెలుసా సీజర్, మోనా, లాంటి ఇంగ్లీషు

పేరు కాదు చక్కగా శాలివాహన" అన్నాడాయన.

'ఓహో' అని ఊరుకుంది చిన్ని.

చిన్ని సంతోషించినట్లు కనపడకపోవడంతో ఆయనకు సందేహం కలిగింది.

"ఇంతకీ శాలివాహన అంటే ఎవరో తెలుసా నీకు? అని అడిగాడు

"తెలియకపోవడమేం? ఇప్పుడే చెప్పారుగా మీరు, కుక్క అని” అంది చిన్ని.

హేతువు

—————-

'రామం వెర్రిబాగులోడు అని నీకెలా

తెలిసింది అడిగింది శారద విజయని.

'పాపం పావురం చచ్చిపోయినట్టుంది.

రామం, అంటే ‘ఎక్కడా?” అని ఆకాశం

వైపు చూశాడు మరి.' అంది విజయ

వెతుకు

—————-

"ఈ కంపూట్యర్ మౌస్

కనబడటం లేదేం? ఎటు

పోయినట్టు?”

“ఒరేయ్ !రాత్రి ఎలుకల బోను

తెచ్చి పెట్టిందెవర్రా? ఈ మౌసు

అందులో ఉంది.”

మరియున్నూ..

________

"కొంచెం శాంతంగా ఆలోచిస్తే

చాలా మటుకు విడాకులు

తప్పిపోతాయి.” అంది లాయర్

ఉష, కొలీగ్ నాగేశ్వర్రావ్ తో .

“అలాగే పెళ్లిళ్లు కూడా”

అన్నాడతను కూల్ గా

విరాళం

________

"తీవ్రవాదులు మా కాలేజీ లెక్చరర్లని

కిడ్నాప్ చేసి యాభైలక్షల రూపాయలు

ఇవ్వకపోతే కిరోసిన్ పోసి

తగలెడతామని బెదరిస్తున్నారు.

దయచేసి ఉదారంగా విరాళాలు

ఇవ్వండి. నేను పదిహేను లీటర్లు

విరాళం ఇచ్చాను..”

తాళం

——————

"ఏమండీ నేను పాడతాను. మీరు

తాళం వేయరూ" అడిగింది

భార్య.

'ఓ ఎస్ అలాగే! మొదలెట్టు'

అని ఆవిడ పాట అందుకోగానే లేచి

గది బయట గొళ్లెం పెట్టి, తాళం

వేసి వెళ్లి పోయాడా భర్త.

బరువు

________

క్లర్కు కుసుమకుమారి రీఫిల్తో నోట్స్ రాయడం చూసి ఆఫీసర్ గారు

"అదేంటి రీఫిల్తో రాస్తున్నావ్. పెన్ను లేదా?”

"అబ్బే ! ప్రస్తుతం నాకు మూడో నెల. నిన్న డాక్టర్ చెకప్ కు వెడితే ఆయన, గర్భణిని కనుక నన్ను బరువులేమీ

ఎత్తవద్దన్నారు సార్ అందుకని” అంది కుసుమకుమారి.

అంతే

___________

మొగుడూ పెళ్లాం జానపద

సినిమాకు వెళ్లారు. సినిమాలో

యువరాణికి చెలికత్తెగా వేసిన ఓ నటిని

చూపిస్తూ భార్య

'ఏమండీ! రాణీ వేషం వేసిన

ఆవిడకన్నా ఆమె పక్కన దాసిగా వేసిన

ఆమే అందంగా ఉంది కదండీ' అంది.

ఆ మాటకు భర్త తలాడిస్తూ

'అదంతే. అలాగే ఉంటుంది. మన

ఇంట్లో పనిమనిషి సత్తెమ్మ లేదూ' అని

నాలుక కరుచుకున్నాడు.

మంచిపని

_________

'ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని నిన్న చెప్పారు కదా టీచర్ అందుకే ఇవాళ నేనుమంచి పని చేశా' సంతోషంగా చెప్పాడు ప్రీతమ్.

'ఏంటది? చెప్పు' అడిగింది టీచర్.

'నేను మరో ముగ్గురం కలసి ఒక ముసలమ్మని రోడ్డు దాటించాం'

గర్వంగా అన్నాడు ప్రీతమ్.

'ఆ పనికి నలుగురెందుకు?'

‘ఆవిడ రోడ్డు దాటనని భీష్మించుకుని కూర్చుంది కదా టీచర్'

రిటర్న్ ఆఫీసర్

___________

రామారావు కారు కొన్నాడు. వాయిదాలు సరిగ్గాకట్టకపోవడంతో బ్యాంకు వాళ్లు వచ్చి కారుతీసుకుపోయారు. విషయం అంతా పక్కనుండి గమనించిన సుందరరావు వెంటనే ఇలా అన్నాడు.

“అరే.. ఎంత పొరపాటు చేసాను.. నా పెళ్లికి కూడా బ్యాంకు లోన్ తీసుకుని ఉండాల్సింది.”

First Published:  31 July 2023 11:33 PM IST
Next Story