తెలుగే మనకు వెలుగు
BY Telugu Global19 Nov 2022 4:42 PM IST

X
Telugu Global Updated On: 19 Nov 2022 4:42 PM IST
కూర్చున్న కొమ్మ ఆసనాన్ని
నిర్లక్ష్యపు గొడ్డలిపెట్టుతో కూల్చి
క్షేమంగా బతకాలనే ఆశల కలని
నిజం చేసుకోవడం సాధ్యమా ?....
కొండంత కొలువుల వ్యామోహంతో
పరభాషల పాదాలకు ప్రణమిల్లి
వికాసానికి వెన్నెముక స్వభాషని
అనాదిగా వదలడం భావ్యమా ?....
ప్రయోజనాల తలపులతో
ఊయలలూగుతూ
ఇంకెంతకాలం
తెలుగుతో చెలగాటం ?...
యాభై ఆరు అక్షర స్వరాల గీతిక
అనంతమైన భావనల పొందిక
ఆ మనకు వెలుగని మరవక
ఆదరించాలితెలుగు నుడిని తప్పక...
అవకాశవాద రెక్కల అలంకరణతో
తెలుగును విడిచి చేసే జీవనవిహారం
కాబోదు ఎన్నడూ ఆమోదయోగ్యం...
ఆ ఆ ల భాషా ఔన్నత్యం ప్రభవించగ
ఎద ఎదలో ఉదయించాలి తక్షణం
సమున్నత భావనల చైతన్యం!...
-కొండూరు వెంకటేశ్వరరాజు (గూడూరు)
Next Story