తను - గిడుగు లక్ష్మీదత్తు ( న్యూజెర్సీ )
BY Telugu Global25 Oct 2022 4:44 PM IST

X
Telugu Global Updated On: 25 Oct 2022 4:44 PM IST
నేను నీకు
ఏమవుతాను అంటూ
ఎప్పుడూ అడుగుతుంటుంది తను
ఆ మాట తన నోట విన్నపుడల్లా
నన్ను నేను ప్రశ్నించుకొంటాను
నిజమే... తను నాకేం అవుతుందని
ఏమీ అవదు.
కానీ ఈ మనసు ఒప్పుకోదు
కానీ నాలోనే ఇమిడి పోయిన
అన్నీ తానే అవుతుంది.
తనే నేను --- నేనై న తాను
నా సర్వ తను
నా ఊహ తను
నా ఊపిరి తను.
ఏ పేరు కను గొనని బంధం తాను.
అణువణువు తనై నేను
నా మనో అద్దంలో చూసుకుంటే తెలిసింది
నాకు తెలియకనే
నాలో ప్రవహించే
నిశబ్ద సంగీతమని
నాకు మాత్రమే వినిపించే గీతమున
నా ఏకాంత వేళల్లో
తనో మౌన సందేశమని
నా అంతరంగ అక్షర రూపిణి అని
Next Story