Telugu Global
Arts & Literature

సారస్వత పరిషత్తు ధర్మ నిధి పురస్కారాలు

సారస్వత పరిషత్తు ధర్మ నిధి పురస్కారాలు
X

2023 సంవత్సరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు వివిధ ప్రక్రియల్లో కృషి చేస్తున్న వారికి ధర్మనిధి సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న సాహితీమూర్తులను పురస్కారాలకు ఎంపిక చేసినట్లు పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

తన పేరుతో ఆచార్య రావికంటి వసునందన్ నెలకొల్పిన పురస్కారాన్ని వి.పి.చందన్ రావుకు, ఆచార్య పి సుమతీ నరేంద్ర అమ్మమ్మ శ్రీమతి ఎర్రం రెడ్డి రంగనాయకమ్మ పేరుతో వారి కుటుంబ సభ్యులు నెలకొల్పిన పురస్కారాన్ని కాసుల ప్రతాపరెడ్డికి, డాక్టర్ లక్ష్మీరెడ్డి నెలకొల్పిన ఆచార్య పాకాల యశోదా రెడ్డి సాహితీ పురస్కారాన్ని డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డికి, ఆలూరి అజయ్ కుమార్ నెలకొల్పిన ఆలూరి బైరాగి పురస్కారాన్ని సిద్ధార్థ కు, డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య నెలకొల్పిన డాక్టర్ వానమామలై వరదాచార్య పురస్కారాన్ని ఆచార్య ఫణీంద్రకు, డాక్టర్ చింతపల్లి వసుంధరా రెడ్డి ఆధ్వర్యంలోని జానపద సాహిత్య పరిషత్తు నెలకొల్పిన జానపద విజ్ఞాన పురస్కారాన్ని డాక్టర్ పాకనాటి జ్యోతికి అందజేయన్నట్లు తెలిపారు.

ఈ నెల 23వ తేదీ ఉదయం 10:30 కు పరిషత్ లోని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో జరిగే ఉత్సవంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నారు. పురస్కారం కింద 5000 రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో వారిని సత్కరిస్తారు.

First Published:  14 Aug 2023 9:11 PM IST
Next Story