Telugu Global
Arts & Literature

ఎన్నాళ్ళో వేచిన బంధం (కథ)

ఎన్నాళ్ళో వేచిన బంధం (కథ)
X

పరధ్యానం గా నడుస్తున్న పల్లవి ఫోన్ రింగ్ అయ్యింది అబ్బా ఇప్పటికి నా ఫోన్ రింగ్ టోన్ విని ఎన్ని రోజులుఅయ్యింది.

ఈ మధ్య ఫోన్ చాల సతా యించుతోంది .అపార్ట్మెంట్ కొండల మధ్య వుంటుంది.సిగ్నల్ సరిగా ఉండదు. తన ఫోన్ కూడ సరిగా పనిచేయడం లేదు.ఇంకొకటి కొనుక్కోవాలి అనుకుంటూనే అనుకొని ఖర్చుల వల్ల సరే !వాట్స్ అప్ అయినా పని చేస్తుంది కదా అని దాటేస్తు వచ్చేస్తోంది.

వాకింగ్ కని కిందకి దిగింది అప్పుడే సిగ్నల్ అందినట్లువుంది. చాలా రోజులకు ఫోన్ రింగ్ టోన్ ఎవరా అని లిఫ్ట్ చేసింది హాయ్ !వదినా అంటూ ఒక కొత్త గొంతు.ఎప్పుడు విన్నట్టు లేదు.

"నేను మీ మేనమామ జగదీష్ కూతుర్ని.నా పేరు స్వాతి "

"అవునా! "అన్నాను. ఎంతో ఆశ్చర్యంతో

"అవును వదినా !మీరు రాసిన బుక్ చదివాను. అందులో మీ నంబర్ చూసి మీతో మాట్లాడాలని నిన్నటి నుండి ట్రై చేస్తున్నాను,ఇప్పటికి మీ ఫోన్ కలిసింది."

నేను ఇంకా ఆ షాక్ నుండి తేరుకోనేలెదు.

మౌనంగా ఏం మాట్లాడకుండ అలాగే ఉండిపోయాను

"ఏం వదినా మాట్లాడర

ఏమని మాట్లాడాలి?

"అమ్మ ఎక్కడ "అన్నాను.

"అమ్మ నా ఐదవ తరగతిలోనే

చనిపోయింది.నాన్న నేను నెలల పాపగా ఉన్నపుడే ! అది మీకు తెలుసు కదా! నాకు చిన్నప్పటి నుండి కష్టాలే వదినా '"అంది.

ఒక వారం రోజుల క్రితం ఒక చుట్టాల పెళ్లికి వెళ్ళానుఅక్కడ మా రిలేటివ్స్ దగ్గర మీరు రాసిన జ్ఞాపకాలు పుస్తకం కనబడింది చూసి తిరిగేస్తు ఉంటే అందులో ఒక పేజీలో జగదీష్ మామ అన్న దగ్గర ఆగి పోయి చదివాను .అది చదివి ఏడుపును ఆపుకోలేక పోయాను. అది చూసి నాకు వరుసకి అత్తయ్య "ఏమైందే ఏడుస్తున్నవు"అంటు నా దగ్గరికి వచ్చింది నా చేతిలో వున్న ఆ పుస్తకాన్ని చూసి అడిగింది

చదివింది చెప్పి అది చూపెట్టాను

అయ్యో! ఆ పుస్తకం తీసుకెళ్ళుఅందులో ఫోన్ నంబర్ఉంది కదా! ఫోన్ చేసి మాట్లాడు .నీకు కొంచమైనా ఊరట కలుగుతుంది అని చెప్పింది.

ఆ పుస్తకం నా దగ్గరే పెట్టుకున్నాను వదినా ! అదులో నంబర్ తోనే మీకు ఇప్పుడు కాల్ చేశాను.వదినా మీరు మా నాన్న గురించి రాసింది చదవగానేనాకు ఏమనిపించిందో తెలుసా!మిమల్ని వచ్చి గట్టిగా కౌగలించుకోవాలి అనిపించింది. మిమ్మల్ని తప్పక కలుస్తాను "అంది

" సరే స్వాతి !నాకు నీతో ఇలా మాట్లాడడం చాలసంతోషంగా ...

ఇంకా నమ్మలేనట్లుగా ఉంది. ఎప్పుడు వస్తున్నావు హైదరాబాద్ కి "అన్నాను

"ఇంకా మూడు,నాలుగు రోజుల్లో వస్తాను "అంది

"సరే !తప్పక వచ్చి కలువు

ఇది నాకు కలనా! నిజమా! అన్నట్టుగా వుంది"

"నాకూ అలాగే వుంది వదినా "అంది

"పెళ్లి అయ్యిందా! పిల్లలు ఎంత మంది?"

"పెళ్లి అయింది.ఒక పాప "అంది

"సంతోషం!"

"నేను ఒక టీవీ ఛానెల్లో వర్క్ చేస్తున్నాను" అంది.

"మరి మంచిది"అన్నాను

"సరే కలుద్దాం! ఈ విషయం ఇంట్లో చెప్పాలి నా నలబై ఏళ్ల కలని

ఇంట్లోఅందరితో పంచుకోవాలని "అన్నాను

"నేను కూడా అదే చేయాలి వదినా !

బై వుంటాను" అంటూ ఫోనేపెట్టేసింది.

నేనుఅలాగే కొంచము సేపు సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతు ఇంటికి వచ్చాను.ఈ విషయం నా పిల్లలకి ,మా వారికి చెప్పాను

వాళ్ళు "అవునా! ప్రపంచం ఎంత చిన్నదో "అన్నారు .

"నువ్వు రాయడం ,వాళ్ళఆమె అది చదివి నీకు కాల్ చేయడం ఎంతో మాజిక్ లాగానే వుంద" అని

నా కూతురు అంది

"అవును "అన్నాను.

" మరి ఇంటికి రమ్మ న్నావా అమ్మా !"అంది .

"రమ్మని చెప్పాను ఇంకా మూడు నాలుగు రోజుల్లో వస్తా అంది"

"ఇంక ఏమిటి !ఇన్నాండ్లకు నీకు ఒక మంచి గుడ్ న్యూస్ తెలిసింది "అంటు నా భర్త వర్ధన్ మెచ్చుకున్నాడు.

"అవును అమ్మా !నీ కల నెరవేరింది నీకు ఇప్పుడు హ్యాపీ కదా" నా కూతురు రమ్య నన్ను దగ్గరికి తీసుకుంటూ అంది

వారి సంతోషం అలాగే చూస్తు నేను నా ఆలోచనలోకి వెళ్లి పోయాను

నేను ఈ మధ్యనే నా చిన్ననాటి జ్ఞాపకాలు ,అమ్మతోనాకు వున్న అనుబంధం అనే ఒక పుస్తకం రాసి దానిని ప్రింట్ చేయించి మా పుట్టిన ఊరిలో ఆవిష్కరణ చేయించాను.

నా చిన్ననాటి స్నేహితులు, ఊరి వాళ్ళు , బంధువులను పిలిచి నా పుట్టినిoట్లో వేడుక చేశాను

అందరు ఆ పుస్తకం చదివి

వాళ్ళ,వాళ్ళ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.అందరు కన్నీటి పర్యంతమయ్యారు .

అప్పటి రోజులు తలుచుకొని

భావోద్వేగానికి గురి అయ్యారు అందరి కీ ఒక పుస్తకం ఇచ్చాను

చాల సంతోషం అనిపించింది

నేను రాసిన పుస్తకం ఆవిష్కరణ నేను పుట్టిన ఊరిలో నా ఆప్తుల మధ్య జరుపుకోవడం.అలాగే సన్మానాలు, సత్కారాలు.అటు తరువాత విందు భోజనం చాల తృప్తి అనిపించింది . వచ్చినవారు కూడ చాల సంతోష పడ్డారు

నేను అమ్మ ఫోటోకి దండం పెట్టుకుంటూ అమ్మ నా కోరిక తీరింది

నీ గురించి రాసి నీకే అంకితం ఇవ్వాలని అనుకున్నానుఅది ఈ రోజు తీరింది.నీ కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకం అయ్యింది అమ్మా !"అంటు కండ్లలో నీళ్ళు తిరుగుతుండగా అమ్మ చూస్తు ఉండిపోయాను

అప్పుడే మా అక్కయ్య, అన్నయ్య వచ్చి " శ్రుతి! నువ్వు అట్లా కంటతడి పెట్టకూడదు చాల బాగా జరిగింది ఈ రోజు కార్యక్రమం . నువ్వు ఎంతో ప్రేమతో రాసావు " అక్క దివ్య అంది

"మా ఊరిలో ఎంతో వైభవం గా జరిగింది ఇంకా నువ్వు ఏమి బాధ పడకు ."అంటు నా భుజం తట్టి నన్ను దగ్గరకు తీసుకుంది

" చూడు శ్రుతి !నీ కల పండింది .నీకు సంతోషంగా ఉందా !ఇప్పుడు "అంటూ అన్నయ్య పవన్ నావైపు చూస్తు అన్నాడు

"చాల సంతోషం అన్నయా !"అన్నాను

"మరి ఇంక ఆ కండ్ల నీళ్ళు పెట్టుకోకూడదు . అమ్మ బాధ పడుతుంది "అంటూ నవ్వాడు

అలాగే !అంటు కండ్లు నవ్వుతూ తుడుచుకున్నాను." అలా వుండాలి శ్రుతి అంటే" అంటు

అప్పుడే వచ్చిన భర్త వర్ధన్ అన్నాడు ఆ మాటకి ముగ్గురు ఒకసారి నవ్వుకున్నారు

ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు

మేము సాయంత్రం పక్కనే సిటీలో వున్న అన్నయ్య ఇంటికి చేరాము.అక్కడ ఒక రోజు గడిపి మా ఇంటికి చేరాము

"ఏమి మమ్మీ !ఏమి ఆలోచిస్తున్నా వు "కూతురు రమ్య అనగానే ఒకసారిగా

"ఏమీలేదు?ఊరిలో జరిగినవి గుర్తుకు వచ్చాయి "అంది

"ఆ పుస్తకం ఇటు తీసుకురా చూద్దాం "అని భర్త వర్ధన్అన్నాడు

తెచ్చి ఇచ్చాను

జగదీష్ మామ అని రాసి ఉన్న పేజీ ఓపెన్ చేసి చూశారు . అందులో నేను రాసింది చదివి నా కూతురు రమ్య, వర్ధన్ నా వైపు చూస్తు

"నువ్వు ఎంత కల్మషం లేకుండ రాశావు .ఒక సంకల్పముతో రాశావు.అందుకే నీ కల నిజమైంది.

నా మేనకోడలు నన్ను కలుస్తే బాగుండు ఆమెని చూడాలి అని నీ ప్రేమని తెలిపావు.అదే జరిగింది.

అదే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ ! మనం ఏది అయితే గట్టిగా అనుకుంటాము అదే జరుగుతుంది".వర్ధన్ అన్నాడు

"నిజం మీరు చెప్పింది నాన్నా !"రమ్య ఆంది.అలా ఆ రోజు మొత్తం సంతోషంగా ఆ విషయ మే మాట్లాడుకున్నారు

స్వాతి వస్తే ఏ వంటలు ప్రిపేర్ చేయాలి ,ఏ డ్రెస్ పెట్టాలి అని ఆలోచించి అన్ని రెడీ పెట్టుకున్నాను. ఆ రోజు రానే వచ్చింది

స్వాతి కోసం ఎదురుచూస్తు వున్నాను

స్వాతి అడ్రస్ అడిగి తొందరగానే వచ్చింది.స్వాతిని చూసి నేను

నన్ను చూసి తను అలా గే ఒక నిమిషం నిలబడి పోయాము.అటు తరువాత 'వదినా !'అంటు నన్ను గట్టిగా వాటేసుకొని ఏడ్చింది

"ఏడవకు "

"ఇన్ని రోజులు నాకు ఎవరు లేరు అనుకున్నాను వదినా ! ఇప్పుడు మీరు ఉన్నారు అదే నాకు దైర్యం

ఇంకా నేను ఒంటరిని కాను నాకు ఒక బంధం వుంది "అని చెప్పింది

"ఇప్పటి నుండి ఒంటరినని అలాంటివిఏవి మనసులో పెట్టుకోకు "అంటూ తననిదగ్గరకు తీసుకొని సోఫాలో కూర్చో పెట్టాను.

చాల విషయాలు మాట్లాడుకున్నాక అందరం కలిసి భోజనం చేసి

అలాగే కొంచం సేపు తను పడ్డ బాధలు చెప్పుతువుంటే బాధతో వింటూ కూర్చున్నాను

"నేను వెళ్తాను వదినా !" అంటు లేచింది

తనకిఒక చీర తాబులం ఇచ్చి

"ఈ సారి నువ్వు వచ్చినపుడు

నీ కూతురు మీ భర్త తో రా "అన్నాను

"తప్పక వదినా !థాంక్యూ అంటూ మా ఆయనకి, రమ్యకి బై చెప్పుతూ వెళుతూ ఒకసారి వెనక్కి వచ్చి .

"వదినా !నేను చాల లక్కీ

నాకు మా నాన్న తరుపు ఒక

చుట్టం దొరికింది .నాకు మా నాన్నని చూసినట్టుగానే వుంది " అని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకొని

" ఈ బంధం ఇలాగే కొనసాగిద్దాం " అంటు బై చెప్పి వెళ్లిపోయింది. నేను "తప్పకుండా" అంటూ నవ్వుతున్న తన వైపు చూస్తూ బై చెప్పాను.

- శైలజ చెరుకు

First Published:  23 March 2023 10:53 AM IST
Next Story