మారాలి ..మారాలి !!
![మారాలి ..మారాలి !! మారాలి ..మారాలి !!](https://www.teluguglobal.com/h-upload/2023/05/31/773606-marali.webp)
మారాలి ..మారాలి !!
కడుపులో పడగానే
ఆడపిల్లాఅని
యోచిoచేముందు
స్త్రీలేనిదే సృష్టిలేదనియోచిస్తే
మొగ్గలోనే తుంచేయటం ఆగుతుందేమో!!??
ముఖానికి రంగులు పూసుకొన్నట్లు
గర్భస్తశిశువురంగులు మార్చాలనే యోచనఆగుతుందేమో!!??
ఊసరవెల్లిలా మారి
ప్లస్ మైనస్ లెక్కలు వేసే ప్రయత్నంఆగుతుందేమో!!??
అండంలోనే పిండదశలోనే
తుంచేసే ప్రయత్నంఆగుతుందేమో!!??
పాపపుణ్యాల విచక్షణలేక
ప్రాణం విలువఎరుగని పశువు
అన్నెంపున్నెం తెలీనిదశలోనే ఆకారందాల్చని శిశువు
అమ్మా.. మొలకగా నీ గర్భంలోఎదుగుతున్నా
ఎదిగి నీకు తోడవుతానమ్మా...
మోదమో ఖేదమో
నన్ను పెరగనీయమ్మా
అని జాలిగా అడుగుతున్న ఆడశిశువు..!!
పరిస్థితులు ప్రాబల్యం వలనో
కాలుజారినస్థితివలనో,
కన్నపేగు మమకారం వద్దనుకున్న స్థితి వలనో..
అండంలోనే చిదిమేసిన సంగతి
సమాజంలో రక్షణలేని ఆడపిల్ల నాకొద్దనే సంతతి
విద్యాధికులు సైతం దీనికివత్తాసు కర్కశంగా అదేగతి
మారాలి సమాజం నైతిక విలువలతో
మారాలి కుటుంబం అనుబంధాల విలువలతో..!!!
ఆడపిల్ల నాకొద్దనే విషసంస్కృతివిలయoనుండి
మారాలి మారాలి
-రెడ్డి పద్మావతి. (పార్వతీపురం మన్యం జిల్లా)