Telugu Global
Arts & Literature

చప్పట్లు (కవిత)

చప్పట్లు (కవిత)
X

సంతోషానికి ,

ఆనందానికి ప్రతీకలు

చప్పట్లు

భావ వ్యక్తీకరణకి

చప్పట్లు

బుడి ,బుడి నడకలు

నడిచే పాపల కోసం

చప్పట్లు,

ముద్దు ముద్దు

మాటలు పలికితే

చప్పట్లు .

పరీక్షలలో రాంకులొస్తే

పిల్లల ఆనందం

చూడాలని కొట్టే

చప్పట్లు,

సభలలో వక్తలు

బాగా మాట్లాడితే

మనసులోనుంచి వచ్చే

చప్పట్లు,

పట్టిన మైకుని వదలక వక్తలు,మాట్లాడుతుంటే

విసుగుతో కొట్టే

చప్పట్లు,

సభలలో కదలిక లేకుండా

జనం కూర్చుంటే,

ఓర్చుకోలేని వక్త -

అడిగి మరీ కొట్టించుకొనే

చప్పట్లు,

ఆరోగ్యానికి మాత్రం

తప్పక కొట్టండి

చప్పట్లు ,

ఈ నా కవిత

చదివినందుకు

నేనే కొడుతున్నా ,

నా పాఠకులందరికీ

మనసారా

చప్పట్లు .

- రాధాయి

First Published:  30 July 2023 4:00 PM IST
Next Story