Telugu Global
Arts & Literature

కాలం! (కవిత)

కాలం! (కవిత)
X

వ్యర్ధం చేయకు కాలాన్ని!

అందుకోలేము దాని గమనాన్ని!

ఓ క్షణం చేజారితే

పట్టలేము దాని వేగాన్ని!

బాల్యంనించి వృద్ధాప్యం దాకా

సమయపాలన తో సాగు ఉన్నతి!

ఆశలు ఆశయాలకు ప్రగతి

సూరీడు తో మొదలు

కాలంతో ఉరుకులు పరుగులు!

హలంతోరైతు కలంతో కవి

సరిహద్దుల్లో సైనికులు

అనుక్షణం అప్రమత్తత!

అందుకే మనలో ఇంత నిశ్చింత


అచ్యుతుని రాజ్యశ్రీ

(హైదరాబాద్)

First Published:  1 Nov 2022 6:39 AM GMT
Next Story