పైడి తెరేష్ బాబు
గాయకునిగా, కవిగా,
సంగీత కారుడుగా,
దళిత సాహితీవేత్తగా
తెలుగు సాహితీ లోకంపై చెరిగిపోని స్థానం పొందినవాడు
పైడి తెరేష్ బాబు
(నవంబర్ 3, 1963 -
సెప్టెంబరు 29, 2014).
తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయన అనతికాలంలోనే సమాజం మెచ్చే కవిగా ఎదిగారు.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో
ఆంధ్రా ప్రాంతానికి చెందిన
పైడి తెరేశ్ బాబు తెలంగాణకు
గట్టి మద్దతుదారుగా నిలిచారు. అంతేకాక.. ఆంధ్రా ప్రాంతంలో కవులు, కళాకారులను కలిసి తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచేలా కృషి చేశారు.
తెరేష్ బాబు ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణంలోని గద్దల కుంటలో సుబ్బమ్మ, శాంతయ్య దంపతులకు 1963 నవంబర్ 3 న జన్మించాడు. తండ్రి శాంతయ్య పద్యాలు రాయడం, పాడడం చేయడంతో తెరేశ్‌బాబు కవిత్వంపై మక్కువ పెంచుకున్నారు.
మొదటిసారిగా కొత్తగూడెం లోని ఆలిండియా రేడియోలో వ్యాఖ్యాతగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఆలిండియా రేడియోలో ఉద్యోగిగా స్థిరపడ్డారు.
తాహెర సుల్తానాతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (ప్రణయ్ చంద్ర), కుమార్తె (సాయి రితిక) ఉన్నారు. నగరంలోని అశోక్‌నగర్‌లో నివసించేవారు
తెలుగులో గజల్స్ రాసి వాటికి ట్యూన్స్ చేసి పాడడంలో ఈయన నిష్ణాతుడు. ముఖ్యంగా అల్పపీడనం, ', హిందు మహాసముద్రం, నేను నా వింతల మారి ప్రపంచం వంటి ఎన్నో రచనలు చేశారు.
మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో సూటిగా, సున్నితంగా గుండెలను తట్టే తడితో ఆయన రాసిన ఎన్నో కవితలు పేరొందాయి. దళిత కవిత్వంలోని అగ్నిజ్వాలలను, అదే సమయంలో మానవ జీవితంలోని ప్రేమ, అనుభూతి అలాంటి అనేక అంశాలను ఆయన తన గేయాల్లో ఆవిష్కరించారు.
కవిసంగమం గ్రూప్ లో చాలా కవితలు రాశారు
ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా పనిచేసిన ఈయన లివర్ వ్యాధితో బాధపడుతూ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, లివర్ పూర్తిగా చెడిపోయి పరిస్థితి విషమించడంతో సెప్టెంబర్ 29, 2014 సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు.