అద్దం - ఆసూరి ఉషారాణి (తిరుపతి)
BY Telugu Global25 Oct 2022 11:20 AM GMT
X
Telugu Global Updated On: 25 Oct 2022 11:20 AM GMT
మనం ఎలా ఉంటామో
అదే చూపిస్తుంది అద్దం
అబద్ధం చెప్పనిది
నిజం దాచలేనివది
అద్దం
వెనుక మాట్లాడడ మెరుగనిది
అద్దం
ముందే నిర్భయంగా కనిపించేది
అద్దం
మౌనంగా వుంటూ
ఎన్నో పాఠాలు
నేర్పేది అద్దం
ఎంత తిట్టినా
ఎదురు మాట్లాడని
పెదవి విప్పనిది
అద్దం
ఒద్దికగా వుంటూ జరిపితే జరుగుతుంది.
పగిలితే
ఇక అతకనిది
ఎన్నో రూపాలుగా
బహిర్గతమయ్యే
ఏకైక వస్తువు
అద్దమే!
Next Story