Telugu Global
Arts & Literature

మానవత్వం( కథానిక )

మానవత్వం( కథానిక )
X

విమల కొడుకు గృహప్రవేశం.......

విమల కంటే నేనే ఎక్కువగా ఫంక్షన్ కోసం ఎదురుచూసానేమో.....విమల నా చిన్ననాటి స్నేహితురాలు......

మధ్యతరగతి కుటుంబాల్లో ఇల్లు అన్నది కలగానేమిగిలిపోతుంది....

ఏదేమైనా ఇన్ని రోజులకు తన కోరిక నెరవేరటం.....కొద్దో, గొప్పో నా సహయం....రవి కూడా... మొదటి నుండి నా సలహాలు తీసుకోవటం .....నాకు తెలిసిన పనివారిని మాట్లాడిపెట్టటం....

మరుసటి రోజు గృహప్రవేశం.

ఇల్లు ప్రక్కనే అవటంతో, వచ్చిన బంధువులలో కొంతమంది నాకూ తెలిసినవారు కావటంతో......మా ఇంట్లో వసతి ఏర్పాట్లు .

మొత్తానికి అనుకొన్న రోజు రానే వచ్చింది.......ప్రక్కింట్లో హడావుడి ఎలాగూ తప్పదు గృహప్రవేశం కాబట్టి .

ప్రొద్దున్నే కాఫీ తాగుతూ......మన ఇంట్లోనా?ఈ ఫంక్షన్ అంటూ మా వారు సెటైర్ల్.

ఉదయం నుండే అతిధుల తాకిడి...కొడుకు,కోడలు....పూజావిధి లో బిజీ.అటు విమల...ఇటు నేను వచ్చేవారిని రిసీవ్ చేసుకుంటూ, పలకరిస్తూ.....ఇల్లంతా కలయతిరుగుతూ ,విమల సంతోషం ,సంబరం ఇంతా, అంతా కాదు...తనను చూస్తూ నేను కూడా .

అంత సంతోషం లోనూ ,

విమల...నేనుఎదురుపడినప్పుడల్లా "గౌరి !ఆ కాస్త పాలిష్ వర్క్ కూడా కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది ,

ఏమిటో ఈ పనివాళ్ళు..

గృహప్రవేశమని ఎంత చెప్పినా...పని పూర్తిచేయనే లేదు. కూతురు పెళ్ళిట ,ఆ పనుల్లో పడి ఈ పని నిర్లక్ష్యం చేసాడు ,కంప్లీట్ అయితే ఆ లుక్కే వేరు కదా గౌరి ".

అప్పడుగాని, నాకు విమల బాధ అర్థం కాలేదు.......ఏనాటి కలో....ఈనాటికి తీరి కళ్ళ ముందు రాజప్రసాదం లా కనువిందు చేస్తుంటే ,చుట్టాలు బంధువులు, స్నేహితులు..మెచ్చుకోవాలని ఆరాట పడటంలో తప్పేమి లేదు.

నాకు తెలిసిన వారిని నేను పలకరిస్తూ, తెలియని వారిని విమల తీసుకొనివచ్చి నాకు పరిచయం చేస్తూ ,ముచ్చటగా గమనిస్తున్న నా దగ్గరకి ఓ పెద్దాయన రావటం...

"అమ్మా నువ్వు రామారావు కూతురివి కదూ "అన్న పలకరింపు తో...ఎవరీయన? గుర్తు తెచ్చుకుంటానికి శతవిధాల ప్రయత్నిస్తున్న నాతో......."తల్లీ నీవు నన్నెరగవు ,మీ నాన్న పుణ్యాత్ముడు, దయగలవాడు ,అవసరసమయంలో నాకెంతో సహయంచేసిన మహానీయుడు."

అసలు ఆయనెవరో ,ఏమి చెబుతున్నారో అర్ధం కాక అయోమయంగా చూస్తున్న నన్ను చూసి ,

"తల్లీ కూర్చో" అంటున్న ఆయన్ని చూసి విమల పరుగునవచ్చి ,

"గౌరి ..ఈయన మా బాబయ్య గారు" అంటూ పరిచయం..అంతలోనే నాన్న అంటూ వచ్చిన ఓ యువతి ని పరిచయం చేస్తూ ,"గౌరి...ఈ అమ్మాయి ,మా బాబాయి కూతురు ,పేరు కమల...మీరు మాట్లాడుకుంటూ ఉండండి..."అంటూ విమల పరిచయం చేసి వెళ్ళిపోయింది.

"అమ్మా గౌరి ,మీ నాన్న చేసిన సాయం ఈ జన్మలో మరవలేను తల్లి" .

"వివరంగా చెప్పండి బాబాయి గారు...నాతో మా నాన్నగారు ఎప్పుడు చెప్పినట్లు గుర్తు లేదు ."

"ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది...ఇదిగో, కమల పెళ్ళి కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి , సరిగ్గా ఇంకో రెండు, మూడు రోజుల్లో పెళ్ళి ఉందనగా , నాకు అందవలసిన డబ్బు అందక ,వియ్యాలవారికి నచ్చచెప్పలేక ,మానసింకంగా కృంగిపోతున్న తరుణంలో, ఆఖరి ప్రయత్నంగా రామారావు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పటం, రెండో మాట లేకుండా ,వెంటనే డబ్బు చేతిలో పెడుతూ...రాఘవా ,నువ్విక ఏమీ ఆలోచించకు ,తీసుకొని వెళ్ళి అమ్మాయి పెళ్ళి చేయి, డబ్బు తిరిగి ఇవ్వాలన్న సంగతి కూడా ఆలోచించకు .

ఆయన దయవల్ల ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా పెళ్ళి చేయగలిగాను తల్లీ ,తరువాత ఎప్పుడో డబ్బు సమకూరిన తరువాత, ఇవ్వబోతే ,ససేమిరా వద్దున్నాడు ,అదేమిటి రాఘవా...నీవెంత ఇబ్బంది పడ్డావో తెలిసింది నాకు, అయినా ఆడపిల్ల కోసం ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోనా?

ప్రక్కనే వున్న కమల కళ్ళు కూడా ఆర్ద్రం తో చెమర్చటం అవునక్క, నాన్న పరిస్థితి, ఆందోళన చూసి చాలా బాధనిపించింది ,సమయానికి రామారావు మామయ్య సహాయం అందించబట్టి ,నాన్న నిశ్చంతగా నా వివాహం జరిపించగలిగారు .

వింటున్న నాకు చెప్పలేని సంతోషం, ఆనందం ,అడిగిన వారికి లేదనకుండా సహాయం చేసేవారని తెలుసుకాని ,

ఈ విషయం తెలియదు బాబాయిగారు ,ఒక విషయం చెప్పనా ,ఏనాడో ఆయన చేసిన సహాయం గుర్తు పెట్టుకొని ,ఇప్పుడు ప్రస్తావిస్తున్నారంటే ,నా దృష్టి లో మీరు కూడా గొప్పవారే , నిన్న చేసిన సహాయమే.. గుర్తు లేదనేవారున్న ఈ సమాజంలో ఏనాటిదో గుర్తు పెట్టుకొని నాతో చెప్పటం ,నా దృష్టిలో మా నాన్న పట్ల వున్న గౌరవం కంటే ,మీపట్ల గౌరవం రెట్టింపయ్యింది బాబాయి గారు .

విమల వచ్చి భోజనాలకి లేవండి అనేదాక...కమల ,ఆయన చేప్పే కబుర్లు వింటూనే వున్న నా మనసంతా ఆలోచనలే, ఎంతకాదనుకున్న, పదిరోజుల క్రిందట జరిగిన సంఘటన నన్ను నిలకడ గా ఉండనీయుటంలేదు .

ఆ రోజు పాలిష్ చేసే మేస్త్రీ మా ఇంటికి వచ్చి,నన్ను డబ్బు అడగటం ,మీరు చెబితే ఇస్తారమ్మ, కూతురు పెళ్ళికి అర్జెంటుగా డబ్బు అవసరం పడింది అంటూ ప్రాదేయపడటం, నువ్వు కంప్లీట్ చేయకుండా నేను చెప్పటం బాగుండదని చెప్పి పంపివేయటం ,నిరాశగా వెళ్ళటం గుర్తు వచ్చి నన్ను నిలవనీయలేదు ,ఆ తండ్రికి పుట్టిన కూతురునేనా ? సహయం చేయగలగే స్థితి లో వుండి కూడా చేయకపోవటం, వెంటనే ...కనీసం పదిసార్లు ఫోన్ చేసిన తరువాత ,ఫోన్ తీసిన మేస్త్రీ తో...నువ్వు రేపు వచ్చి డబ్బు తీసుకొని వెళ్ళు అని చెప్పేదాక నా మనసు శాతించలేదు.

నెక్స్ట్ డే వచ్చి డబ్బు తీసికొని కూతురు పెళ్ళి జరిపించిన తరువాత, ఇంకో పదిహేను రోజులకి, విమల వర్క్ పూర్తి చేసిన సందర్భంలో ,రవి ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళటంతో విమల రిక్వెస్ట్ మీద వారింటికి వెళ్ళి పనివారందరికీ ఫైనల్ పేమెంట్స్ సెటిల్ చేయటంలో సహాయం చేస్తున్నప్పుడు...పాలిష్ చేసిన మేస్త్రీ తనకు వచ్చిన డబ్బులో నుండి పది వేలు తీసి నా కిస్తూ అడిగిన , ప్రశ్న నన్ను సంబ్రమాశ్చర్యాలకి గురి చేసింది...అమ్మా ,డబ్బు కోసం మొదటగా మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కాదన్న మీరు, పదిసార్లు ఫోన్ చేసి పదివేలు ఇవ్వటం..అదీ ,వర్క్ కంప్లీట్ అవలేదని తెలిసీ సహాయం చేయటం ,మీ దయవల్ల నా కూతురు పెళ్ళి సక్రమంగా జరగటం సంతోషమనిపించి, మీ డబ్బు వాపస్ ఇస్తున్నాను అనగానే...ఆశ్చర్యంతో నా కళ్ళ తడి నాకే తెలియటం..

పనివారందరిని కూర్చోపెట్టి, గృహప్రవేశం నాడు జరిగిన సంఘటన ,మా నాన్నగారు చేసిన సహాయం వివరించి....ఈ డబ్బు నా తరుపునుండి నీ కూతురుకి కానుకగా ఇవ్వని చెప్పగానే

మేస్త్రీ చెప్పిన మాట..ఒక్కక్షణం నన్ను చకితురాల్ని చేసింది, " అమ్మా ఇది విన్న తరువాత నేను కూడా, ఎవరికైనా ,ఏ టైమ్ లోనైనా అవసరమైనప్పుడు ఇలానే సహాయం చేస్తాను "

అది చాలదూ మానవత్వం ఇంకా మిగిలేఉందని చెప్పటానికి .

- కనకదుర్గ


First Published:  11 Nov 2022 1:34 PM IST
Next Story