లెస్ లగేజ్ (కథ)
సూర్యుడు సాయం సంధ్య వేళ పడమర కనుమలలో అమ్మ ఒడి లోకి వెడుతున్న ఆకాశము ఎర్రని రంగుతో నిండి ఎంతో రమ్యంగా ఉంది.
ఆ రోజు మద్రాస్ వెళ్ళడానికి సర్కార్ కి రమ్య బయలు దేరింది
పిన్ని కూతురి పెళ్లి .అమ్మని రమ్మన మంటే "నాతో యాతన పడాలి, సిటీలో కళ్యాణ మండపము ,ఇల్లు దూరంగా ఉంటాయి .ఓపిక ఉండి అన్ని తట్టుకో గలిగితే వెళ్ళాలి .నాకు సకాలంలో భోజనం కుదరదు.నువ్వు వెళ్లు "అన్నది.
అంతే కాదు !సారె కూడా అంద్ర నుంచి పురమాయించి పంపుతోంది గృహప్రియ వంట ఇల్లు వారు అన్ని కూడా సప్లై చేస్తారు.కానీ డబ్బు ఎక్కువ అవుతుంది
"నేను తయారు చేయించి పంపుతాను "అని వసుధ కి చెప్పింది ."అలాగే పెద్దమ్మా !" అని వసుధ సంతోష పడింది.
పెళ్ళికొడుకు వాళ్ళు కర్ణాటక లో సెటిల్ అయ్యారు .అంధ్రా వాళ్ళే .ఉద్యోగ రీత్యా అక్కడ అన్ని అమర్చుకున్నారు .మైసూర్ లో ఒక్ ఇల్లు, బెంగుళూర్ లో ఒక ఇల్లు ఉన్నాయి ,.బ్యాంక్
బేలన్సులు దండిగా ఉన్నాయి.
ఈ రోజుల్లో అంతా విద్యావంతులు ఉద్యోగస్తులు .నెల తిరిగి వచ్చేటప్పటికి లక్షల కొద్దీ జీతాలు .టాక్స్ లు బాగానే చెల్లిస్తారు ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇచ్చే తీరిక ఉండదు కానీ సంపాదన బాగానే ఉన్నది.
వసుధని అందుకే అన్నీ వాళ్ళు ఆంధ్ర పిండి వంటలు కావాలి అన్నారు.
"సరే !పెద్దమ్మ అయితే బాగా చేయించి పంపుతుంది "అని వసుధ సంబర పడింది.
సరే అమ్మ చేయించినవన్నీ రమ్య అన్ని బ్యాక్స్లు సర్దించి పోర్టర్ చేత తోపుడు బండి మీద పెట్టించి "నా కోచ్ ఎస్ 2 దగ్గరకు రావాలి "అని చెప్పింది .సహాయంగా పక్కింటి వారి డిగ్రీ చదివే అబ్బాయిని అమ్మ కూడా పంపింది .
"ఏమిటే రమ్యా !అంత చిన్న బ్యాగ్ పట్టుకెడ్తున్నావు .బట్టలు చాలావద్దా "అన్నది.
"లేదమ్మా !నేను రెడీ మేడ్ ఎంబ్రాయిడరీ జాకెట్స్ ,కంచి
పట్టు చీరలు కొనుక్కొంటా
అందుకని రెండు చీరలు పట్టు కెడు తున్నాను ."
"పెళ్లి లగేజే ఎక్కువ ఉంది
ఇంకా బట్టలు ఎక్కడ పట్టు కెళ్ళాలి ?
వంద మినప సున్ని
వంద పూత రేకుల చుట్టలు
రెండు వందల లడ్డూలు
రెండు వందల అరిసెలు
రెండువందల మై సూర్ పాక్
రెండు వందలు రవ్వ లడ్డు
పురమాయించిన బాక్స్ లు
మామిడి పళ్ళు, అరటి గెలలు,
పెళ్లికి కర్పూరం దండలు,
కర్పూర పుల్లలు,
నెయ్యి 10 కేజీలు ,అమ్మ
ప్యాక్స్ చేయించింది
ఇన్ని పట్టుకెడుతుంటే ఇంకా
బట్టల సూట్ కేస్ ఎందుకు?
"వాళ్ళకి కావాల్సినవి పట్టు కేడు తున్నా ను కదా!"
"అదికాదు పీటల మీద బట్టలు పెట్టడానికి "
"దాన్ని కొనుక్కొని ఉంచమని డబ్బు పంపాను.ఏమి చేసిందో ?మనం పట్టుకెళ్ళే బట్టలు వాళ్ళకి నచ్చవు కదా"
"సరే లే !అటో వచ్చింది అప్పగింతలు తరువాయి. నీ క్యాష్ బ్యాగ్ జాగర్త అన్నది "అందులో కార్డ్ లు మరీ జాగ్రత్త"
"అదికాదు రమ్యా ! ఈ ఐదువేలూ దగ్గర పెట్టుకో చిల్లర! ఖర్చు కు ఉంటుంది"
"ఎందుకు ? ఇప్పుడు కాఫీ బాయ్స్ సహితము ఫోనే పే ,గూగుల్ పే పెట్టుకుని ఉన్నారు" అన్నది రమ్య
"అది కాదు రమ్యా! నామాట విను "అంటూ పర్సులో డబ్బు కుక్కింది.
ఆటో ఎక్కి రైల్వే స్టేషన్ కి వచ్చింది సామాను తో .ఒకటవ నంబర్ ఫ్లాట్ ఫాం అని టికెట్ లో ఉన్నది .సరే అని పక్కింటి అబ్బాయిని పంపేసి ,పోర్టర్ తో లగేజ్ పట్టించుకుని అక్కడ బెంచిపై కూర్చుంది .
ఎదురు ఎండ ఇంకా ప్రతాపం పోలేదు .మార్చ్ నెల. ఇంకా ఎండ తీవ్రత ఉంటుంది
వెళ్ళిన అరగంటకి అనౌన్సర్ గొంతు సవరించుకుని "ప్రయాణికులకు ప్రకటన సర్కార్ కాకినాడ నుంచి వచ్చేది ఫ్లాట్ ఫాం రెండు కు పదినిమిషాల్లో వస్తుంది
ప్రయాణికులు రెండో నంబర్ ఫ్లాట్ ఫాం కి వెళ్ళవలసినది "అని చెప్పగానే కలకలం బయలు దేరింది .ఎవరి సరుకును వాళ్ళు పట్టుకుని పరుగెత్తారు .
కొందరు అడ్డంగా దిగి ,కొందరు మెట్ల మీద నుంచి వెడుతున్న వైనం కనిపిస్తోంది .
ఇక్కడ ఇంకా లిఫ్ట్ లు ఎస్కలెటర్ లు లేవు ,పరుగు పరుగున పోర్టర్
సామాను పట్టుకుని వెడుతుంటే వెనకాల పరుగెత్తింది.
అప్పటికి రైలు స్టేషన్ చేరింది
'అమ్మో !అమ్మని తెస్తే చాలా కష్ట
ము అవును 'తను ఒక్కర్తే కనుక పరుగు పెట్టింది .సామాను అంతా లెక్క ప్రకారం లోపలికి సర్ధించి కూర్చుంది .
డబ్బులు పట్టు కెళ్ళడం వల్ల సరిపోయింది .అతను ముందు చెప్పిన దానికన్నా డబుల్ ఇవ్వమని అడిగాడు చేసేది ఏముంది?
ఇచ్చి తీరాలి .అప్పటికే కూత వేసి రైలు బయలు దేరింది.
ఏదో సిటీ జీవితం అనుకుంటారు కానీ ,అందులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.ఇక్కడి సరుకులు ,తిండి అలవాటు పడ్డ వాళ్ళకి ఎక్కడివీ నచ్చవు .అయితే
రూకలు అక్కడ ఉన్నాయి
రాత్రి అంతా ప్రయాణం అని తెచ్చుకున్న తిండి దోసెలు తిని మంచి నీళ్ళు తాగి పడుకున్నది.నిద్ర పట్టదు గా !సరుకులు అమ్మే వారు ,మధ్యలో స్టేషన్లహడావుడి అంతా సరిపోయింది .
తెల్లవారే టప్పటికి చెన్నై లో దిగింది .అదో పెద్ద స్టేషన్ .అక్కడ కూడా "అమ్మ వచ్చి ఉంటే ఎంతో ఇబ్బంది పడేది .
లిఫ్ట్ ఎక్కడో ఉన్నది ."
సరే !ఆటో మాన్ ని పంపారు .వాడు లగేజీ వేసుకుని వెళ్ళాడు .ఎలాగూ వాళ్ళ అబ్బాయి కారు తెచ్చాడు
అది ఎక్కి ఇంటికి వెళ్లింది.
అప్పటికే పెళ్ళి కూతుర్ని చేస్తున్నారు .
"ఇంత ఆలస్యంగా వచ్చావా?
ముందు రమ్మని చెప్పాము గా !"అంటూ ఇంటిల్లిపాది ప్రేమ చూపారు ."పెళ్లి అయ్యాక ఉంటాను లే "అన్నది. 'అహా! 'అంటూ నవ్వారు .
పేరంటం జరుగుతుండగానే లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి ,పేరంటాలు తో కలీసిపోయింది రమ్య .అందరికీ వాయినాలు ఇచ్చి పంపింది .
"హమ్మయ్య !నువ్వు వచ్చావు నాకు బడలిక తీరింది "అంటూ
పిన్ని కూతురు వెంకట పద్మజ తృప్తి పడింది.
ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాయి .నేను ,వాళ్ళ అబ్బాయి రాహుల్ కలిసి బట్టల కొట్టుకు వెళ్లి ఏవో చీరలు ,పిల్లకి బుట్టలు ,పట్టీలు ,పూజ సామాను పిల్లాడికి గిఫ్ట్ కొన్నాను. వాళ్ళకి బట్టలు మొత్తానికి నచ్చినవే కొన్నాను
పెళ్లి ఘనంగా చేశారు .హోటల్లో అన్నీ ఏర్పాట్లు. పది లక్షలు ఖర్చు .భోజనాలు తమిళుల పద్దతి లో పెట్టారు .ఆంధ్ర వాళ్ళ పద్దతిలో పెళ్లివారికిపెట్టారు .నెయ్యి ,బూరెలు ,కాజ అన్ని వడ్డించారు పెళ్లి వారికి సార. స్టీలు డబ్బాల్లో పెట్టి
ఎస్ ఆర్ ఎంటీ లో పంపారు .
ఎప్పటినుంచో ఉన్నవారితో మూడుపూటలా కలిపి ఓ వెయ్యి మంది వచ్చారు .
హమ్మయ్య !అని స్థిమిత పడ్డారు ఇంటికి అన్ని పెద్ద కార్ లో పంపేశారు
అంగ బలం ,అర్ధ బలం రెండు ఉన్నాయి .వాళ్ళ మామగారు గొప్ప పేరున్న వ్యక్తి .అందుకని అన్ని బాగా జరిగాయి
ఇంక రమ్య రెండో రోజు వెళ్లిపోతానని ట్రైన్ బుక్ చేసింది.
అన్నీ అరచేతి వైకుంఠం లోనే గా !కానీ వాళ్ళు అంతా .."అప్పుడే వద్దు" అని బాధ పడ్డారు .కానీ రమ్య "వెళ్లి పోతాను .అమ్మని చూసే వాళ్ళు లేరు "అని తొందర పడింది
"వేరే రోజు వెళ్ళు "అని పట్టు బట్టారు "కాదు "అని ,రమ్య మరునాడు బయలు దేరింది.
"మాకు బెంగుళూర్ నుంచి పిల్ల ఈ రోజు వస్తోంది .అక్కడ శ్రీ రమా సత్నారాయణ వ్రతం శ్రీ వేంకటేశ్వర దీపారాధన చేసి పిల్ల, పిల్లాడు అత్త మామ వస్తారు .నువ్వు కూడ ఉండా"లని పట్టు పట్టినా సరే ,రమ్య వినలేదు ."నేను వెళ్ళాలి అమ్మ ఒక్కర్తే ఉంది .హెల్పర్ రెండు రోజుల కన్నా ఉండదు.పెన్షన్ కోసం వెడుతుంది"అని రమ్య వాళ్ళు తెప్పించిన ఆటోలో స్టేషన్ కి వెళ్ళింది
ఆటో కుర్రాడు లగేజీ పుచ్చుకుని రైలు ఎక్కించి ,అన్ని సర్ది రైలు బయలు దేరాక వెళ్ళాడు .అక్కడి స్టేషన్లో రమ్యకు లగేజ్ లేదు కనుక ఒక బ్యాగ్ స్వీట్స్ కవర్ తప్ప ఇంకేమీ లేవు అందుకని సుఖంగా అనిపించింది .
అంతే !మరునాడు ఉదయం తెల్ల వారుతుండగా రైలు తణుకు చేరింది
అప్పుడు ఎక్కించిన పోర్టరే ఎదురు గా రైలు ఆగే టప్పటికి వచ్చి నించున్నాడు .
రమ్య ఒక్క బ్యాగ్ తో దిగింది
"అదేమిటి అమ్మగారు !ఏమి తేలేదు మద్రాస్ షాపింగ్ చెయ్యి లేదా ?"అన్నాడు వాడు .ఎప్పుడు మా కజిన్స్ వచ్చినా సరే ,ఎదురు వెళ్లి సామాను అందుకుంటాడు ."పోనీలే నువ్వు ఆశపడి వచ్చావు .అని చెప్పి
ఓ యాభై రూపాయలు ,స్వీట్ పాకెట్ చేతిలో పెట్టింది
అతని ఫోన్ నంబర్ మా వాళ్ళ దగ్గర ఉంటుంది. "అభి మద్రాస్ నుంచి ఫోన్ చేసి చెప్పింది "అని చెప్పాడు .
అంతే !మాఇంట్లో హెల్ప్ ర్ పెన్షన్ కి వెళ్ళిందిట.
ఆ మర్నాడు భారత్ బందు .అన్నీ ఆపేశారు
హెల్పెర్ మాత్రం మనుమడు స్కూటర్ పై వచ్చింది
"ఎప్పుడు ఎలా మారుతుందో ప్రపంచం తెలియదు .ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. అందుకే పెద్ద వాళ్ళు దూరం ప్రయాణాలు అసలు
పెట్టుకో కూడదు .సిటీ జీవితం కొందరికే పరిమితము .అన్నీ ఉన్నప్పుడు మధ్యరకం చిన్న ఊళ్లే నయము "అని పెద్దలు అంటారు .
కానీ 'ఎక్కడ రూకలో అక్కడ నూకలు 'అంటూ యువత పెద్ద పట్టణాల వైపు పరుగులు పెడుతున్నారు .
వృద్ధులు పల్లెల్లో జీవితాలు వెళ్లమారుస్తున్నారు .
'నానాటి బ్రతుకు నాటకము'అని అన్నమయ్య శ్రీవెంకటేశ్వర స్వామి కీర్తనలో అన్నా ,'జీవితం ఒక నాటకరంగం 'అని ఇంగ్లీష్ కవి షేక్ స్పియర్ అన్నా ,జీవిత నాటకం లో సామాన్యులు సిటీ జీవితం బహు కష్టం అంటారు.కానీ ఇప్పుడు అంతా హైదరాబాద్,మద్రాస్ ,బెంగుళూరు ,మైసూర్ అంటూ పరుగులు తీస్తున్నారు.అంత కంటే ఇంకొంచెం స్తోమత ఉన్నవాళ్లు పెద్దల్ని వదిలేసి విదేశాలు పరుగులు పెడుతున్నారు.
ఇదే ప్రగతా ?
వృద్దులకు ఎంత డబ్బు పంపినా పిల్లలనుండి ఆదరణ ఆప్యాయతలు అంతంత మాత్రమే అయితే సమస్యలు తీరిపోతాయా ? డబ్బే సర్వస్వము కాదు కదా ! మీరూ ఆలోచించండి.
⁃నారుమంచి వాణి ప్రభాకరి (తణుకు)