Telugu Global
Arts & Literature

ఆఖరి ఉత్తరం - శ్రీమతి రేణుకా అయోల

ఆఖరి ఉత్తరం  - శ్రీమతి రేణుకా అయోల
X

చందన్ దాస్ గజల్స్ లో కొన్ని చాల ఇష్టంగా పదేపదే వింటాను

అందులో ఇది వొకటి

ఇది అనువాదం అనను

గజల్ విన్నాక నా భావం మాత్రమే...

కొన్ని జ్ఞాపకాలని కొందరు మనుషులనిమరచిపోలేము ,మరచిపోవాలి అనుకుంటూమళ్ళీ మళ్లీ వాళ్ళ గుర్తులతో ,వాళ్ళ రహదారులని కొలుచుకుంటూ ఆగిపోతాం

ఆగిన ప్రతీ సారి!ఇది యింక ఆఖరు, యింక తలచుకొనే తలచుకోను

అనుకున్నట్టు గా అనిపించే ఈ గజల్ నా భావాలతో ...

Aakhri khat hai mera

Lyrics -- Ibrahim Asq

Composed by -- Chandan das

Aakhri khat hai mera, Jispe hain naam tera.

Aaj ke baad koi khat na likhoonga tujh ko.

ఇదే నా ఆఖరి ఉత్తరం

దాని మీద నీ పేరు వుంది

ఇంక ఇవాల్టి నుంచి

నీకు ఎలాంటి ఉత్తరం రాయనిక

నిన్ను మరచిపోతానా?

ఇది మాత్రం చెప్పలేను

మనసు మీద

ప్రేమ జోరు ఉండనే వుంటుంది

అయినా నా ప్రాణమా

ఒట్టు వేసి చెప్తున్నాను

ద్వేషిస్తూ నిన్ను కష్ట పెట్టను ఎప్పటికీ....

నమ్మించి దూరం జరిగావని

ఎప్పటికీ అనను .

జ్ఞాపకం తడిపిన ఆ క్షణాలు

నన్ను సతాయించినా

నాకు నేను దూరంగా వెళ్ళిపోతాను .

పొరపాటున నిన్ను కలవడం జరిగితే ....

పరాయి వ్యక్తిలా

నీ దారిలో నుంచితప్పుకుంటాను

మనసు నీకోసం తపిస్తుంది కాని నిన్ను పిలవను

ఇవాల్టి నుంచి ఎప్పటికీ ...

ఈ నీ నగరం

ఈ దారులు

జ్ఞాపకాలు నిండిన గోడలు

ముక్కలైన నా కలలు

వాటికి తెలుసు...

రేపు ఇవన్నీ వదిలి

చాల దూరం వెళ్ళాలి నేను..

నేను వెళ్ళే చోటులో ఎండ, నీడ కొలతలకి అందని అదృష్టం వుంటాయి

నన్ను యింక గుర్తు పెట్టుకోకు

ఇవాల్టి నుంచి

నిన్ను ఎప్పటికీ కలవను ..

ఇదే నా ఆఖరి ఉత్తరం,

దాని మీద నీ పేరు వుంది ..

జ్ఞాపకాలు నిండిన గోడలు

ముక్కలైన నా కలలు

వాటికి తెలుసు...

రేపు ఇవన్నీ వదిలి

చాల దూరం వెళ్ళాలి నేను..

నేను వెళ్ళే చోటులో ఎండ, నీడ కొలతలకి అందని అదృష్టం వుంటాయి

నన్ను యింక గుర్తు పెట్టుకోకు

ఇవాల్టి నుంచి

నిన్ను ఎప్పటికీ కలవను ..

ఇదే నా ఆఖరి ఉత్తరం,

దాని మీద నీ పేరు వుంది ..

First Published:  28 Oct 2022 7:48 AM GMT
Next Story