నవ్వుకుందాం కాసేపు
కుక్కని తప్పించ బోయి,
కళాకృష్ణ బైక్ కంట్రోల్ తప్పి,
సైడు కాలువలో పడ్డాడు
కష్టపడి బైటికి చేరాడు.
అటుగా వస్తున్న ఓ అందమైన అమ్మాయి కారు ఆపి దగ్గర కొచ్చింది.
బాగానే వుందా? ఏదైనా ప్రోబ్లమా? అని అడిగింది.
లేదు..లేదు..నేను బాగానే వున్నట్టున్నాను. అన్నాడు కళాకృష్ణ
పరవా లేదు !! రండి.. చెక్ చేస్తా !!. మా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర" అందామె.
“థేంక్యూ! కానీ మా ఆవిడకి ఇష్టం వుండదు." అన్నాడతను.
“మరోలా అనుకోకండి. నేను నర్స్ ను. ఏవైనా దెబ్బలు తగిలి వుంటే చూసి ట్రీట్ చేస్తాను. అనుకోడానికేముంది.?" అందామె.
ఆమె చాలా అందంగా వుంది
కళాకృష్ణ 'నో ' అనలేక పోయేడు. అయినా అన్నాడు.. "మా ఆవిడ అస్సలు ఇష్టపడదు.. నేనిలా చెయ్యడం.!"
అయినా ఆమెను చూస్తూ ఏమీ అనలేక, ఆమె ఇంటికి వెళ్ళారు. చెక్ చేసి పెద్ద ప్రోబ్లమ్స్ యేమీ లేవని కన్ఫర్మ్ చేసిందామె.
ఆమె ఇచ్చిన డ్రింక్ తాగాడు. రెండు రౌండ్స్ అయ్యేక " మా ఆవిడ ఖచ్చితంగా ఫీలవుతుంది. నేను వెళ్తా.!!" అన్నాడతను.
"సిల్లీగా వుంది మీరుచెప్పేది.. అసలు ఆవిడ కెలా తెలుస్తుంది ? ఆవిడ ఇంటి దగ్గర వుంటుంది కదా "అందామే
*కాదు. ఆవిడింకా కాలువలోనే వుంది "అన్నాడు కళాకృష్ణ .
మొగుడు తప్పిపోయాడని కంప్లైంట్ ఇవ్వడానికి పక్కింటి
పిన్ని గారితో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది కాంతం.
ఇన్స్పెక్టర్: మీ ఆయన ఎలా ఉంటారమ్మా?
కాంతం : ఆరడుగుల పొడుగు, మంచి రంగు, బుగ్గ మీద సొట్టతో చాలా అందం గా ఉంటారు.
పిన్నిగారు: అదేంటే, మీ ఆయన నల్లగా, పొట్టిగా, బాన పొట్టతో ఉంటాడు కదా.
కాంతం: మీరు నోరు ముయ్యండి పిన్ని గారూ.
పోయినోడు ఎలాగూ పోయాడు.
పోలీసులు పట్టు కొచ్చే వాడైనా మంచి వాడు వస్తాడు కదా...అని .
టీచర్ :టర్కీ వాళ్ళను టర్క్స్ అని పిలుస్తారు.మరి జర్మనీ వాళ్ళను ఏమని పిలుస్తారు
పిల్లవాడు :"జెర్మ్స్"
వెంగళప్పా, వెర్రిపప్పా టీ త్రాగుతూండగా ఫోన్ మ్రోగింది. వెర్రిపప్ప ఫోన్ విని బేర్‌మని ఏడవసాగాడు.
‘ఏమయింది’ అని అడిగాడు వెంగళప్ప. ‘‘మా అమ్మ ఇప్పుడే ఫోన్‌చేసి మా నాన్నగారు చనిపోయారు అని చెప్పింది’’ అన్నాడు వెర్రిపప్ప.
‘‘అయాం సోసారీ’’ అంటూ వెర్రిపప్పను ఊరడించాడు వెంగళప్ప.
అతను ఏడుపు ఆపుకునే టైంకి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తి వెర్రిపప్ప మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు.
‘‘ఏమయింది’’ అడిగాడు వెంగళప్ప.
‘‘మా ఆవిడ ఇప్పుడే ఫోన్ చేసింది. ఆవిడ మామగారు కూడా చనిపోయారట’’ అంటూ బావురుమన్నాడు వెర్రిపప్ప.
**
గృహహింసకు పాల్పడ్డాడని బాబూరావ్‌ని పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచారు.
‘‘మీ ఆవిడను అంతలా ఎలా కొట్టావ్’’ అడిగాడు జడ్జి.
‘‘వ్యాయామం చేసిన నా శరీర బలమే దోహదపడిందనుకుంటున్న
నా పొడుగాటి బలిష్ఠమైన చేతులు, పిక్కబలంగల నా కాళ్లు బాగా
ఉపయోగించగలిగాను’’ అన్నాడు బాబూరావు.
పూర్ణచంద్ర పుస్తకాల షాపుకు వెళ్లి ‘‘భార్యను లొంగదీసుకోవడం సులభమే అనే పుస్తకం వుందా’’అని అడిగాడు.
అక్కడున్న సేల్స్‌గర్ల్ ‘‘సారీ అండీ! కాల్పనిక సాహిత్యం దొరికేది ఇక్కడ కాదు. వేరేచోట’’ అంది కూల్‌గా.
‘‘గర్ల్‌ఫ్రెండ్‌కీ సెల్‌ఫోన్‌కీ గల తేడా ఏమిటి?’’ అడిగాడు రమణ చలపతిరావుని.
‘‘సెల్‌ఫోన్‌ని సైలెంట్‌మోడ్‌లో పెట్టగలం’’ అన్నాడు చలపతిరావు.