Telugu Global
Arts & Literature

మానవత్వం (అనుభవం)

మానవత్వం (అనుభవం)
X

నేను ప్రతి రోజు ఆఫీస్ కు బస్సులో ప్రయాణిస్తుంటాను. రక రకాల ప్రయాణికులు, మనస్తత్వాలు.

సెల్ ఫోన్ రాక ముందు పిచ్చాపాటి కబుర్లు ఉండేవి. సెల్ ఫోన్ వచ్చాక బస్సు ఎక్కడం తల వాల్చడం, ఎఆర్ ఫోన్ రెండుచెవుల్లో దూర్చుకోవడం మొబైల్ లో దూరి పోతుంటారు. స్టేజి వచ్చేదాకా తల పైకి లేవదు.

అంతదాకా ఎందుకు ?నా పరిస్థితి అంతే. కాక పోతే నాకు బుక్స్ చదవడం అలవాటు కావున కాసేపు చదవడం, చల్ల గాలికి నిద్ర వస్తే కాసేపుకునుకు తీయడం. నా స్టేజి వచ్చిన తరువాత దిగి పోవడం.

కాక పోతే నే ప్రయాణించే బస్సులో కొంత మంది అమ్మాయిలు రక రకాల పూలను, నేరేడు పండ్లను, జామపండ్లను, చెనిక్కాయలను కవర్లల్లో పెట్టుకొని ఎక్కడం అంతా పదహారు ఏండ్ల నుంచి ఇరవై ఏండ్ల వారు. రెండుస్టాపింగ్ ల తర్వాత దిగడం, వచ్చిన ఆ కొంత సమయం డ్రైవర్ తో, కండక్టర్ తో చక్కగా మాట్లాడడం తెచ్చినవి కొంతవారికిద్దరికి ఇవ్వడం రివాజు. వారుంటే సందడిగా ఉండేది. నాకు కూడా ఎంతో ముచ్చటేసేది వారిని చూస్తుంటే.

ఓ రోజు బస్సులో వీరు ఎక్కడం, వెనుక సీట్లో వయసు మళ్ళిన దంపతులలో ఆ ముసలాయనికి అప్పుడు ఛాతిలో నొప్పిగా ఉంటే చేతితో రుద్దుకో సాగాడు. "డ్రైవరన్నా బస్సు ఆపు" అంటూ ఒక్క ఉదుటున ఆ పిల్లలుగమనించి పరుగెత్తి ఆ పెద్దాయన దగ్గర కెళ్ళి, గబా గబా ఒకరు అర చేతులను రుద్దడం, ఒకరు అరి కాళ్ళను రుద్దడం.

ఒకరు ఛాతిని మెల్లగా రుద్దడం. ఒకరు నీళ్ళు త్రాగించడం ఇలా ప్రాధమిక వైద్యం వారికి తెలిసింది వారు చేసారు. ఈలోగా డ్రైవర్ బస్సును ప్రభుత్వ అసుపత్రి ముందు ఆపాడు. వెంటనే అతన్ని తీసుకెళ్ళడం. సకాలంలో ఆసుపత్రికి వెళ్ళడం వలన అతని ప్రాణాలు అతనికి దక్కాయి.

బస్సులో అందరూ చోద్యం చూస్తున్న వారే, నాతో కలిపి తప్ప ఇలా పరుగెత్తి ప్రాణాలు కాపాడాలన్న ఆలోచనా తీరుకి వారి మానవత్వానికి ప్రయాణికు లందరు ఆ పిల్లలకి కృతజ్ఞతలు తెలిపారు.

-ఆసూరి ఉషారాణి (తిరుపతి)

First Published:  8 Nov 2022 3:26 PM IST
Next Story