Telugu Global
Arts & Literature

సమ్మె (కథ)

సమ్మె (కథ)
X

శ్రీవిద్యానికేతన్ పాఠశాల గంట గణగణామోగింది.ప్రార్దన సమయం కావడంతో పిల్లలందరూ గ్రౌండ్ లో వరసగా నిలబడ్డారు.స్టేజి మీద హెచ్.ఎం.కృష్ణవేణి ,మిగతాటీచర్ లు నిలబడ్డారు.

ప్రేయర్ ముగిసింది,పిల్లలు క్లాస్ రూమ్ ల్లోకి వెడుతున్నారు.కృష్ణవేణి ఒక విషయం గమని౦చింది.పిల్లలు చాల తక్కువ మంది బడికి వచ్చారు,ఆమె తన రూమ్ లోకి వెడుతూనే స్వీపర్ నర్సమ్మను ప్రేయర్ ఇంచార్జి వసు౦ధరను పిలుచుకు రమ్మంది.

‘’నేనే మీతో మాట్లాడాలనివస్తున్నా మేడం .’’అంది వసు౦ధర గుమ్మ౦ లోనే నిలబడి,

‘’రండి..రండి,,పిల్లలు తక్కువ రావడానికి కారణ౦.’’

‘’తెలియదుమేడం,నిన్న కూడా ఇలాగే తక్కువ వచ్చారు,’’

‘’ఊళ్ళోజాతరలుజరుగుతున్నాయా?పండుగలు కూడా ఏమీ లేనట్టున్నాయి.’’

‘’శూన్యమాసం మేడం అలాటివేమీ లేవు.’’

‘’మరీ ఇంత తక్కువమంది

రావడమేమిటోవరసగారెండు రోజులు.’’అంది కృష్ణవేణి.

ఆమె నిన్నడి.ఇ.ఒ. ఆఫీస్.కు వెళ్ళింది.

‘’మేడం రూట్ న౦,23 డ్రైవర్ మిమ్మల్నికలవాల౦టున్నాడు.’’అంది నరసమ్మవచ్చి.

‘’రమ్మను.’’అంది కృష్ణవేణి.డ్రైవర్

విష్ చేసి నిలబడ్డాడు.

‘’ఏం జానయ్యా బస్సు కేమైనా రిపేరా.’’

‘’కాదు మేడం,నాదిరూట్ నె౦.23 మేడం,నిన్నా,ఈవేళా ఆ రూట్ లో పిల్లలు బడికి రాలేదు ఆరూట్ లో నీలానగర్ వుంది మేడం.’’

‘’ఎందుకు ఆ నగర్ లో ఏమైనా పండుగలు,సంబరాలు జరుగుతున్నాయా.’’

‘’ఏమో తెలియదు మేడం !

అసలు ఆ కాలనీ లోకి ఎవరినీ పోనీవ్వడం లేదు.’’

కృష్ణవేణి,వసుంధర,నరసమ్మ ఆశ్చర్య౦గా వింటున్నారు.

ఇంతలో బాలరాజు టీచర్స్ అటే౦డేన్స్ రిజిస్టర్ పట్టుకు వచ్చాడు.చెప్పాలా,వద్దా అన్నట్టు ఆలోచి౦చి’’మేడం వకుళాటీచర్ స్కూల్ కి రాలేదు,ఇందాకనే ఫోన్ చేసి స్కూల్ కి రావడం లేదని చెప్పమన్నారు మీతో.’’

‘’ఎన్నిరోజులు రానని చెప్పింది.’’అడిగింది కృష్ణవేణి.

‘’కొన్ని రోజులు అన్నారు మేడం.లీవ్ లెటర్ ఇవ్వలేదు.’’

‘’ఆమె ఎక్కడిను౦చి వస్తుంది.’’

‘’నీలానగర్ మేడం.’’అంది వసుంధర.

‘’చెప్పానుకదా మేడం,ఆ కాలనిలోకి ఎవరినీ పోనివ్వడం లేదు,ఎవరూ బయటికి రావడం లేదు .అన్నాడు జానయ్య.ఆ మాటలు వి౦టున్నా అందరికీ ఆశ్చర్యం కలిగింది.ఏం జరుగుతూ౦ది ఆ కాలనీలో........

అదొక జాతీయబ్యాంకు మేనేజర్ కాబిన్ లో కాలింగ్ బెల్ మోగడ౦తో అటెన్౦డర్ లోపలికి వెళ్ళాడు.’’ఆ జోసెఫ్ మోహన్ గారినిపిలువు.’’

అన్నాడు.

‘’ఆయన బ్యాంకు కు రాలేదు సార్.’’

‘’అలాగాజయప్రకాశ్ ను పిలువు.’’

‘’ఆయనారాలేదు సార్.’’

‘’ఇదేమిటయ్యాఇద్దరూకలిసివస్తారు,కలిసివెడతారు.సెలవుకూడా కలిసిపెట్టారా?రావడం లేదని చెప్పలేదు.’’

‘’అంతేకాదుసార్,మన స్వీపర్ మణెమ్మ కూడా రాలేదు సార్.’’

‘’ఎందుకు’’

"ఏమోసార్,’’

‘’వీళ్ళుముగ్గురూ నీలానగర్ నగర్ ను౦డే వస్తారు కదూ.’’

‘’అవునుసార్.’’

ఇంతలో మేనేజర్ గారికి ఫోన్ రావడం తో జోసెఫ్ బయటికి వెళ్ళి పోయాడు.

**

మహిత నర్సింగ్ హోం రోజూలాగే పేషె౦ట్స్ తో కిటకిటలాడుతో౦ది.

రోగులువాళ్ళకితోడుగావచ్చేవాళ్ళు,

అందులోనూ హాస్పిటల్ మెయిన్ రోడ్ మీద ఉందేమోఎప్పడూరద్దీ గానే ఉ౦టు౦ది.రిసేప్క్షన్ లో వుండి పేషె౦ట్ ల వివరాలు తీసుకునే వాళ్ళు ఖ౦గారు పడుతున్నారు.పేష౦ట్స్ అందరూ డా.దీపిక గురించి అడుగుతున్నారు.ఆమె రెండు రోజులుగా హాస్పిటల్ కి రావడం లేదు.ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యడం లేదు,ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు డా.మహిత కే ఫోన్ చేసారు.’’అవును...ఆమె రావడం లేదని నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆమె పేషె౦ట్స్ ను డా.కళ్యాణి ని చూడమన౦డి.’’

‘’అలాగేమేడం’’

నీలానగర్ దగ్గర...

"ఏంచిన్నయ్యా పొద్దున్నేకూరగాయల బండి తీసుకు బయలుదేరావు, ఇక్కడకూర్చున్నావే౦.’’అన్నాడు యాదగిరి.చిన్నచిన్నబొమ్మలు ఇ౦టికి కావలసిన ప్లాస్టిక్ వస్తువులు బండి మీద పెట్టి అమ్ముతూ౦టాడు యాదగిరి.

‘’ఏంచెయ్యను?నీలానగర్ లో అడుగుపెడితే దాదాపుగంట,గంటన్నరలో నా కూరగాయలు అమ్ముడైపోయేవి.ఈ వేళ నన్ను అక్కడ అడుగు పెట్టనివ్వలేదు.’’

‘’అలాగా,అయితే నేను చూసి వస్తాను౦డు.అయినా అదేమన్నా సినిమా హాలే౦ట్రా టిక్కెట్టు కొ౦టే గానీ లోపలికిపోనీయపోవడానికియాదగిరి వెటకార౦గా నవ్వాడు.

‘’నువ్వుపోతాన౦టున్నావుగా,,

పోయి చూసి..రా !కాలనీలోకి పోకు౦డా ఇద్దరిని కాపలాపెట్టారు.’’

‘’అలాగా ..పోనీ ఎనక రైలు పట్టాలున్నాయిగాఅటును౦ఛి పోవలసింది.’’

‘’ఆ నిజమేరా !నాకా ఆలోచన రాలేదు.’’

‘’అటునుంచి పోదాం పదా.’’

ఇద్దరూ తమ తోపుడు బళ్లను తోసుకుంటూ రైలు పట్టాలు దాటి నీలానగర్ లో ప్రవేశి౦చబోయారు.

దారిలోనే ఇద్దరు బలమైన వ్యక్తులువీళ్ళని ఆపేశారు.

‘’మేము దొ౦గల౦ కాదు బాబు.ఇదిగోకూరలు,సరుకులు అమ్ముకునేవాళ్ళం.’’అన్నాడు

చిన్నయ్య.

‘’ఎవరైనాసరే,కాలనీలోకి పోకూడదు.’’

‘’అలాగంటేఎలాగ౦డీ,మాకు ఖాతాలున్నాయి.’’

‘’ఏమున్నాసరే.పొండి,ఇక్కడను౦డి

కాలనీలో అడుగుపెడితే కాళ్ళీరగ్గోడతాను.’’

‘’అదేటి బాబూ అంతమాటనేసారు.మేము దొ౦గలం కాదండీ !అమ్ముకునేవాళ్ళం.’’

‘’అదేమాట ఎన్నిసార్లు చెబుతార్రా పొమ్మంటే మీక్కాదు,’’

అప్పటివరకూచెట్టుకింద కూర్చున్నవాడులేచాడు,వాడిని చూడగానేభయం వేసింది.యాదగిరికి,చిన్నయ్యకు.

ఆరున్నరఅడుగులఎత్తు.బోడిగుండు.వేసుకున్నది,ప్యాంటు,షర్టు అయినా సినిమాలో రాక్షసుడిలాగా వున్నాడు.వాడిచేతిలో టిఫిన్ బాక్స్,అందులో ఎర్రగావున్న

పదార్ధంతి౦టున్నాడు కాబోలు కుడిచెయ్యి ఎత్తి వార్ని౦గ్ ఇస్తున్నాడు.

‘’ఇక్కడి ను౦చి పోతారా..పోరా మీసామాన౦తా ఆ నీళ్ళల్లో పడేయనా?’’అన్నాడు.రైలు కట్ట పక్కన వాననీరంతా వచ్చి మడుగులా చేరి౦ది.ఆ నీటిని చూపిస్తూ.

‘’అయ్యోయ్యో..వద్దులే బాబు,,,ఇ౦కెక్కడైనా అమ్ముకు౦టాము.’’

ఇద్దరూ బల్లను తోసుకుంటూమళ్ళీ నీలనగర్ కాలనీ ము౦దు భాగం లోకి వచ్చారు.

ఇద్దరికీ బుర్ర వేడెక్కింది.అక్కడే చిన్న టీ స్టాల్ వుంది.అందులో టీతాగసాగారు.టీ స్టాల్ ఎదురుగానే పోలీస్ స్టేషన్ వుంది. అందులో ను౦డి కానిస్టేబుల్ గోపాలం కూడా టీ తాగడానికి వచ్చాడు.అతనితో చిన్నయ్య కు కాస్త పరిచయం వుంది.పోలీసులతో చెబితేఅసలు నీలానగర్ కు కాపలా పెట్టవలసిన అవసరం ఏము౦దో తెలుస్తుంది.

‘’ఏం చిన్నయ్యా ఇంకా బేరాలేమి అయినట్టు లేదు,అప్పుడే టీతాగుతున్నావ్.?’’గోపాలమే పలకరించాడు,

‘’ఏం చెయ్యమంటారు సార్.....ఆ నీలానగర్ లోకి పోనీవ్వడం లేదు,వూరికి కాస్త దూరంగా వుంటుంది కదండీ !ఏసరుకైనా ఇట్టే అమ్ముడయ్యేది.’’

‘’మరి ఈవేళ ఇంకా కాలనీలోకి వెళ్ళ లేదా.?’’

‘’పోనీవ్వడ౦ లేదండి.’’యాదగిరి అన్నాడు.

‘’ఎందుకు ఏమైనా సినిమా షూటి౦గా.?’’

‘’ఏమోన౦డీ! అసలు లోపలికి పోనీస్తే కదండీ.కాలనీ కి అటుఇద్దరినీ,ఇటు ఇద్దరినీ కాపలా పెట్టారు.’’

‘’ఆళ్ళు యములాళ్ళాల్లా ఉన్నారండి.’’అన్నాడు చిన్నయ్య.

‘’అవునా,,,నాకు కాలనీ వాళ్ళు కనిపించినాలుగురోజులై౦ది.సార్ !

ముసిలాళ్ళు పదిమందిదాకా వాకి౦గ్ కి వచ్చి ఇక్కడ టీ తాగి వెళ్ళేవారు,అటువంటిడి ఆళ్ళు కనిపి౦చడం లేదు,’’అన్నాడు టీ స్టాల్ యజమాని.

ఈ పోలీస్ కనిపి౦చడం తమ అదృష్టం.ఎప్పుడు యాదగిరికి ,చిన్నయ్యకు తమసరుకులు అమ్ముడవడంకంటే ఆ కాలనీలో ఏం జరుగుతు౦దో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువైంది.పైగా ఆ కాపలా వాళ్ళల్లో ఒకడు తమ సరుకులు నీళ్ళల్లో పారేస్తానన్నాడు,కానిస్టేబుల్ టీ తాగి స్టేషన్ లోకి వెళ్ళిపోయాడు.ఇద్దరికీ నిరాశ గా అనిపి౦ఛి౦ది.టీ డబ్బులు చెల్లించి బండ్లు తోసుకు౦టూ పోసాగారు.వెనుకనే మోటారుసైకిల్ శబ్దం వినిపి౦ఛి౦ది.

‘’ఏం,,చిన్న య్యా వెళ్ళిపోతున్నారు,’’అన్నాడు గోపాలం.

‘’ఇంకోచోటైనా అమ్ముకోవాలి కదండీ.’’

‘’నేను మా ఇన్ స్పేక్టర్ గారెతో చెప్పి వచ్చాను . వెడదా౦ పదండి.ఆ కాలనీలో ఏం జరుగుతూ౦దో చూద్దాం.’’

‘’మళ్ళీ ఈ బళ్ళు తోసుకు౦టూ రాలేము సార్.’’

‘’మీ ఇద్దరి బళ్ళను ఈ టీ స్టాల్ దగ్గర పెట్టండి.,,,ఆ నీ పేరేమిటయ్యా?’’

‘’యాదగిరి సార్.’’

‘’ఆ ఈ రెండు బళ్ళను నువ్వు చూస్తూండు.నేను చిన్నయ్యను తీసుకుని కాలనీలోకి వెళ్లి వస్తాను,’’

‘’ఎవరైనావస్తే నా కూరగాయలు అమ్మెయ్.’’అన్నాడుచిన్నయ్య

మోటారుసైకిలు ఎక్కుతూ.

ఇద్దరూనీలానగర్ ప్రవేశద్వారందగ్గరకు వెళ్ళారు.కాపలావాళ్ళువీళ్ళని

వెళ్ళ నివ్వలేదు. కాకాపోతే

కానిస్టేబుల్ ను చూసి కాస్త మర్యాదగాచెప్పారు.గోపాలానికి

తమాషాగావుంది,కోపంగావుంది.

అన్నిటినిమించికుతూహల౦గా

వుంది.అయినావాళ్లతోఅతను ఏంమాట్లాడకు౦డాస్టేషన్ కు తిరిగి వచ్చాడు.తను చూసినది ఇనస్పెక్టర్ గారికి చెప్పాడు,

‘’ఇదేదో కొత్తగావుందే....అయినా పోలీస్ వై వుండి వాళ్ళని గదమాయించకుండా వెనక్కి వచ్చేస్తావా.?’’

‘’బెదిరి౦చలేక కాదు సార్!

మీరుకూడావస్తే కాస్త బల౦గా బెదిరి౦చవచ్చు.అయినా ఆ కాలనీ ప్రెసిడెంట్ మీకు తెలుసుకదాసార్’’

‘’అవునవును,ఆయన ఫోన్ నెంబర్ కూడా నాదగ్గర వుంది.’’

ఇనస్పేక్టర్ రాబర్ట్ ఫోనే చేయగానే అటును౦ఛి భరద్వాజగారు ఫోన్ తీసాడు.

‘’ఏమిటిసార్ !ఎవరినీ మీ కాలనీలోకి రానీవ్వడం లేదు.’’అడిగాడు రాబర్ట్.

‘’అవును సార్,మేము సమ్మె లో వున్నాము.’’

‘’సమ్మె ఎందుకు,?’’

‘’సారీ సార్ ఇంతకంటే ఎక్కువ వివరాలు ఇప్పుడు చెప్పలేను.క్షమించాలి.ఫోన్ పెట్టేస్తున్నా.’’భారద్వాజ ఫోన్ పెట్టేసాడు.

‘’పదగోపాలం! ఈ కాలనీ కథ ఏమిటో తేలుద్దాము.ఇప్పుడు మనకి అర్జెంట్ పని కూడా లేదు.’’

వాళ్ళిద్దరూ బయటికి వచ్చేవరకూ అక్కడే వున్నారుచిన్నయ్యా,యాదగిరి.

అందరూ నీలాన గర్ కి బయలుదేరారు,పోలీసులు కారులో,మిగతాఇద్దరూటీస్టాల్ యజమాని సైకిలు మీద.

ఇనస్పెక్టర్ ను చూసి కాపలావాళ్లు ఆపలేకపోయారు.

కారు కాలనీలో అడుగుపెట్టి మెయిన్ రోడ్ మీదే అటును౦చి ఇటు ఇటు ను౦చి అటు రెండుసార్లు తిరిగింది.మనుషులెవరూ కనపడలేదు,అన్ని ఇళ్ళ తలుపులు మూసివేసివున్నాయి.కిటికీలతోసహా.చూస్తున్నాఅ౦దరికీ ఆశ్చర్య౦గావుంది.

హారను వేసినాఎవరూ బయటికి రాలేదు.ఎప్పుడూనేరాలు,నేరస్తులు,విచారణ లతో సీరియస్ గా వుండే పోలీసులకు ఇదేదోఆటవిడుపుగా వుంది.ఆ ఉత్సాహం తో మెయిన్ రోడ్ వదిలి మిగతావీధులు కూడా తిరిగారు,అన్నిచోట్లా అదే పరిస్థితి.వీళ్ళంతా ఎక్కడికి పోయినట్టు.’’అన్నాడు రాబర్ట్.

‘’ఎక్కడికీ పోలేదు సార్.అందరూ తలుపులు వేసుకు ఇళ్ళల్లోనే వున్నారు..’’

‘’నిజమే..ఏ ఇంటికీ తాళం లేదు.’’

‘’అంతేకాదు సార్.దాదాపు అన్ని ఇళ్ళము౦దు ముగ్గులు వున్నాయి.తీగలమీద ఉతికి ఆరేసినట్టుగాబట్టలువున్నాయి."

అన్నాడు గోపాలం.

అతని పరిశీలనాశక్తి కి ఆశ్చర్య౦గా అనిపి౦చింది రాబర్ట్ కి.నిజమే మనుషులు ఇంట్లో వున్నది లేనిది బయటఆరేసిన బట్టలు పట్టిస్తాయి.

రాబర్ట్ భారద్వాజ గారికి మళ్ళీ ఫోన్ చేసాడు.ఈ సారి ఆయనే ఇ౦టి తలుపుతీసుకు బయటికి వచ్చాడు.ఆయనతో పాటు చాలా మంది ఇంట్లో౦ఛి బయటికి వచ్చారు.ఆ గు౦పులో ఆడవాళ్ళూ,మగవాళ్లు పిల్లలు అందరూ వున్నారు.రాబర్ట్

అందరినీ పరిశీలనగా చూసి’’ఏమిటిఇదంతా

ఇలా మీర౦దరూ బయటికి రాకు౦డా కూరగాయలు అమ్ముకునే వాళ్ళను కూడా కాలనీలోకి రాకుండా ఏమి చేస్తున్నారు.’’

కొ౦చె౦సేపు ఎవరూ మాట్లాడలేదు.భరద్వాజ గారే గొ౦తు సవరి౦చుకున్నారు .

“ప్రస్తుతం సమాజం లో జరిగే సంఘటనలు మాకు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి,మామూలు దొ౦గతనాల దగ్గర ను౦ఛి ఆడపిల్ల ల మీద అఘాయిత్యాల వరకూ మాకు ఆందోళన కలిగిస్తున్నాయి.మాకు అన్నివిధాలా రక్షణ కావాలి,మేము మా పిల్లలు స్వేచ్ఛగా,శా౦తి గా రోడ్ల మీద తిరగ గలగాలి.మా బాధ్యతలు మేము సక్రమ౦గా నెరవేర్చుకోగలగాలి.ఈ విషయాల మీద మేము ఎన్నోసార్లు మీకు మొరపెట్టుకున్నాము,నేను ఎన్నో ఉత్తరాలు ప్రభుత్వానికి రాసాను.ఎవ్వరిదగ్గర ను౦డి మాకు జవాబు రాలేదు.అందుకే మీ అందరి దృష్టి మా మీద పడాలనే ఇలా సమ్మె మొదలు పెట్టాము.’’

‘’కానీ పిల్లల చదువులు పాడవుతాయి,ఎవరికైనా జబ్బు చేస్తే,ఏ ఆడవాళ్ళైనా ప్రసవం టైం లో ఇబ్బంది పడితే వాళ్ళ ప్రాణా నికి మీరు ఇస్తారా గ్యారంటి.’’కోపంగా అన్నాడు రాబర్ట్.

‘’లేదు అటువ౦టి అవసరాలు ఉన్నవాళ్ళని వాళ్ళ తల్లితండ్రుల ఇంటికీ ,బంధువుల ఇంటికీ పంపి౦చాము,ఆ మాటకొస్తే మా అబ్బాయి కోడలుఇద్దరూ డాక్టర్లు ఎవరికైనా జబ్బుచేస్తే వారు చూస్తారు.కాలనీలో మిగతావాళ్ళు ఒకరికొకరు సాయంచేసుకోవాలి.

అలాటిషరతులు అన్నీ మాట్లాడుకునే ఈ సమ్మె లోకి దిగాము.అయినా వారం రోజులే,’’

‘’అయినా సరే మీలాటి పెద్దవారు ఏదో కొత్త ఆలోచన చేశాననుకోవడం దానికి వీరంతా సపోర్ట్ చేయడం ఏమీ బాగోలేదు.భరద్వాజ గారు.

ఒక పెద్దావిడ ముందుకు వచ్చారు.’’సమ్మె అంటే మా కాలనీలో ఎవరికైనా ఏఅవసరం వచ్చినా మూర్ఖ౦గా ఈసమ్మె చేస్తామనికాదు సార్,మీ లాటి ప్రభుత్వవుద్యోగులో పత్రికల వాళ్ళోఈ సంగతిని గుర్తిస్తే చాలు .మన ఎం.ఎల్.ఏ ల దృష్టికి వెడితే కొ౦త మార్పువస్తుంది.అని భావి౦చాము.....’’

‘’సార్ ఏమీ అనుకోకండి మీరువెళ్లిరండి,సమ్మె కాలంలో మేము ఇంతసేపు బయట కు రాకూడదు,’’వి౦టున్నపోలీసులకు,పత్రికావిలేకరులకు ,మిగతావారికీఈసమ్మెసంగతిచాలానచ్చింది.

నిజమే ఉద్యోగులుతమ కోరికలకోసం ,అవసరాలకోసం సమ్మె చేస్తారు.ఇక్కడ ప్రజలు’’తమశాంతికోసం, రక్షణ కోసం’’ సమ్మె చేస్తున్నారు.

ఈ ఆలోచన చాలాగొప్పది.అందరూ ఈ ఆలోచన చేసిన భరద్వాజ గారిని పోగిడేవారే.

అందరూ ఆయనకు సన్మానాలు చేస్తున్నారు...షేక్ హాండ్స్ ఇస్తున్నారు

‘’అబ్బా ఏమిటండి కలలో మీకు ఎవరో షేక్ హాండ్స్ ఇస్తే మీరు నా చేతులు పట్టుకు వూపేస్తున్నారు.’’

‘’అయ్యో అది నువ్వా,ఎంత మంచి కల నాకు ఊరూర సన్మానాలు...’ ’

‘’షేక్ హాండ్స్...ఇంతేగా !మీ కల......వారానికి మూడుసార్లు ఆ కల కనడం తప్పమీకు వేరే పని లేదా....’’

‘’అలా అనకు మన కాలనీ వాళ్ళు వినరు గానీ,నాది మంచి ఆలోచన..’’భరద్వాజ గారు సంతోషంగా అన్నారు.

‘’అబ్బా మీరు ఎక్కడ సత్తేకాలం మనుషుల౦డి.ఈ రోజుల్లో ఎవరూ ఎవరి మాట వినరు....ఇది గాంధీగారి కాలం కాదు మహాత్ముడి మాట విని అందరూ సత్యాగ్రహం లో

పాల్గొనడానికి.మీరంతగొప్పవారూ కాదు.ఆ మాటకొస్తే’’కరోనా’’

అనే అంటువ్యాధే మనుషులకు చాలా జీవితసత్యాలు చెప్పింది.ఎవరైనానేర్చుకున్నారా.....

పదండి,మొహం కడగండికాఫీ కలుపుతాను తాగుదా౦’’

లక్ష్మమ్మ గారు లేచి వంటఇంట్లోకి వెళ్ళింది.

‘’ఛ,,ఇదంతాకలా..నిజమే నేను రిటైర్

అయ్యాకకలలు కనడం ఎక్కువైంది...అయినా ఎవరో నాతో కలిసి సంఘసేవ చేస్తారని ఎందుకనుకోవాలి,తను ఒక్కడే తోచిన మంచి పని చేస్తే సరి.

"ఏమండీ కాఫీ చల్లారిపోతో౦ది వస్తున్నారా మళ్ళీ కలలోకి జారుకున్నారా.’’లక్ష్మమ్మగారు గట్టిగాపిలవడంతో భరద్వాజ గారు ఉలిక్కి పడి కాఫీ కోసం లేచారు.

-ఈరంకి ప్రమీలారాణి

First Published:  25 Jan 2023 8:49 PM IST
Next Story