నిగ్రహవాక్యం
BY Telugu Global5 April 2023 6:06 PM IST

X
Telugu Global Updated On: 5 April 2023 6:06 PM IST
వంద గులాబీ రేకుల మధ్య
ఒక వంకర ముల్లు...
వక్రోక్తుల నిప్పులమీద పొర్లి
వగపుమంటలో
దహించుకుపోవడం
విధి నిర్ణయమా?
అనాలోచితం
‘ఉద్దేశపూర్వకం’గా
బట్వాడా అయినప్పుడు
అపరాధమనిపించేదాని ముందు
భూతద్దపు బూచి ప్రత్యక్షం!
దండ వేస్తున్న చేతుల్ని
ఖండించే కరవాలాలకు
పొర్లుదండాలే
పొలుపైన సమాధానం
ముల్లును కిరీటంగా
ధరించిన మొక్కను సైతం
ధ్వంసం చేయనివాడే
నిజమైన వనమాలి!
- ఎలనాగ
Next Story