Telugu Global
Arts & Literature

ఈ చీకటి నదిని దాటుతూ (కవిత )

ఈ చీకటి నదిని దాటుతూ (కవిత )
X

వెలుతురు ప్రవాహపు మార్గంలో సాగిపోవాలని

ఈ చెట్లు

విరబూసిన తెల్లని మల్లెలను పరిమళాలను ఆస్వాదిస్తూ

ఇలాగే ఇలాగే..

మనసును దోచే మల్లెల కన్నా

మంచి మనసు లోని

ప్రేమమయ గానం

నన్ను పరవశింప చేస్తుంది

బ్రతుకంతా కష్టాలు కన్నీళ్లు

కాలువను దాటి

ఒక వృద్ధుని అనుభవసారాన్ని

ఒక గాధ గా వింటున్నాను

ఈ వేళ నేను

ఎన్నో రాత్రులను

ఎన్నో

వెన్నెల పున్నమి రోజులను ఆనందిస్తూ

మిత్రులతో

అనురాగ సంభాషణ చేస్తూ

బ్రతుకులోని అనేక ముచ్చట్లను

కష్ట సుఖాలు కావడి మోస్తూ

నిజాయితీకి అద్దం పట్టే

నడవడికను ఆకాంక్షిస్తూ

సాగిపోతూనే ఉంటాను నేను

నా మిత్రుల కరచాలనం మధ్య

వారి ప్రేమమయ శుభాకాంక్షల మధ్య అనురాగాల మధ్య

ఆనందాల మధ్య విషాదాల నడుమ

వాటిని దాటుకుంటూ ఆవలి వంతెనలో ఆనంద కాలానికి స్వాగతం పలుకుతూనే .....

ఈ రాత్రి ఇలాగే గడుపుతో

రేపటి ఉషోదయాన్ని మనసు నిండా కోరుకుంటున్నాను...

అప్పటిదాకా నిరీక్షిస్తూ నే ఉంటాను

రెప్పవాల్చకుండా కన్నులతో

మనసు నిండా

గాఢ ఆకాంక్షలతో.......

- డాక్టర్ . సిహెచ్.ఆంజనేయులు

(ఖమ్మం బోనగిరి కోట)

First Published:  6 Nov 2022 12:31 PM IST
Next Story