Telugu Global
Arts & Literature

సద్భావన

సద్భావన
X

లో కాసమస్తాసుఖినోభవన్తు అన్నది భారతీయుని వాక్కు తనతో పాటుగా సర్వ జగత్తు సర్వసంపన్నంగా

సర్వసమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించేవారు భారతీయులు. ఏ

పనిని ప్రారంభించినా ఆ పని నిర్విఘ్నంగా సాగి దాని ప్రతిఫలం సర్వులకూ శుభాన్ని కలుగచేయాలని భారతీయులుకోరుకోవడం వారి సహజ లక్షణం. గాలి మాధుర్యంగా

వీచాలి. వృక్షాలు ఫలపుష్పసంపదతో వర్ధిల్లాలి, ప్రాణికోటి అంతా సుఖసంతోషాలతో జీవించే పరిస్థితులు కలిగిఉండాలని అభిలషించమని వేదం చెప్తుంది. వేదాన్ని ప్రమా ణంగా తీసుకొనే భారతీయుని కోరిక లోకాసమస్తా సుఖినోభవన్తు అనే కాక మరో

మాటకు అవకాశం ఉండుదుకదా.

మంగాళాది మంగళమధ్యం మంగళాంతం అనే ప్రతి పనీ

ఆరంభించేటప్పుడు

అంటారు. ఆరంభించిన పని శుభకరమైన సాధనతో పాటు శుభమైన ఫలితాంశాన్ని

ఇవ్వాలని భారతీయులు కోరుకుంటారు. అందుకే ముప్పది మూడోకోట్ల దేవతలను

సృజించుకున్నారు. భగవానుడు ఒక్కడే అన్న సత్యం తెలిసినా సరే చెట్టు పుట్ట, మట్టిమశానం అంతా భగవంతుడే అన్నది భారతీయుని విశ్వాసం. ఇలా ఎందుకంటే

భగవంతుడు కానిది ఏదీఉండదనే నమ్మకమే .ఏదారిన అంటే ఎవరికి తోచినట్టు వారు భగవంతుడిని ఉపాసిస్తే అవి అన్ని కూడా నన్నే చేరుతాయని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. అందుకే అందరు కలసి విశ్వశాంతిని నెలకొల్పాలన్నది భారతీయుని

ఆకాంక్ష. ఇలా విశ్వశాంతి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అంటే మొట్ట మొదటగా వ్యక్తి ఉన్నత ఆశయాలు కలిగిఉండాలి. దీనివల్లే భగవద్గీత నిన్ను నీవు ఉద్దరించుకోవాలి

అంటుంది. తననుతాను ఉద్ధరించుకొని తాను మంచి ఆశయాలతో జీవిస్తూ మంచి

కోరికలతో మంచి పనులు చేసినవాడు తనకు తెలియకుండానే ఎదుటివారిలో కూడా ఇదే తత్వాన్ని సృష్టించగలడు. తాను బాగుపడి తర్వాత తన కుటుంబ సభ్యులని బాగు పరిచి తద్వారా సమాజాన్ని బాగుచేయడం వ్యక్తి బాధ్యత. అందుకే వాజసనేయ

సంహిత నన్ను అందరూ మైత్రీ భావంతో చూడాలి. నేను అందర్నీ మైత్రీ భావంతో చూడగలిగేలా చేయి అనే ప్రార్ధించాలని అంటుంది. ఇలా భావించడం కాంక్షించడం.

అనేది భారతీయ సంస్కృతిలో మౌలికాంశం.

- సి.హెచ్. సునీత

First Published:  8 Jun 2023 8:11 PM IST
Next Story