Telugu Global
Arts & Literature

"మహాకవి జాషువా సాహితీ పురస్కారముకు ఎంపికైన ఆళ్లనాగేశ్వరరావు"

మహాకవి జాషువా సాహితీ పురస్కారముకు ఎంపికైన  ఆళ్లనాగేశ్వరరావు
X

మహాకవి గుఱ్ఱం జాషువా 127 వ జయంతిని మరియు గుఱ్ఱం జాషువా స్మారక కళాపరిషత్, దుగ్గిరాల సంస్థ 35 వ వార్షికోత్సవ శుభ సందర్బంగా ఆ సంస్థ వారు ది. 28/10/2022 న శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించు వివిధ సాహిత్య సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖులను గుర్తించి జాషువా పురస్కారములతో సత్కరించనున్న నేపథ్యంలో తెనాలికి చెందిన కవి, రచయిత, ఆర్టీసీ కండక్టర్ ఆళ్ల నాగేశ్వరరావును మహాకవి జాషువా పురస్కారముకు ఎంపిక చే సారు.

ఆయనకు పురస్కారముతో పాటు కవితా భూషణ్ బిరుదుతో ప్రముఖుల సమక్షంలో ఘనంగా సత్కరించ నున్నట్లు, ఆ సభకు విచ్చేసి, ఆ పురస్కారమును స్వీకరించమని కోరుతూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పెద్దేటి యోహాన్ పంపిన ఆహ్వాన పత్రికను ఆళ్ల బుధవారం అందుకున్నారు. నాలుగు దశాబ్దములుగా ఆళ్ల నాగేశ్వరరావు చేస్తున్న సాహిత్య కృషికి గుర్తింపుగా ఈ మహాకవి జాషువా పురస్కారం ను మరియు కవితా భూషణ్ బిరుదును ప్రదానం చేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దేటి యోహాన్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పురస్కార ప్రదానంతో నా బాధ్యత మరింత పెరిగినదని, మహాకవి జాషువా అడుగుజాడల్లో అడుగులిడుతూ సామాజిక చైతన్యమును కలిగించే అభ్యుదయ రచనలు చేసి, సాహితీ. కళామతల్లికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

ప్రస్తుతం ఆళ్ల నాగేశ్వరరావు వృత్తిపరంగా గుంటూరు...2 డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తూ, ప్రవృత్తిగా వివిధ సాహిత్య పక్రియల్లో రచనలు చేస్తూ, జాతీయస్థాయిలో పలు సాహితీ సేవా సంస్థల అవార్డులు, రివార్డులు అందుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆళ్లను లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, విష్ణు మొలకల భీమేశ్వర ప్రసాద్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ షేక్ అబ్దుల్ హకిమ్ జానీ, సహజకవి అయినాల మల్లేశ్వరరావు, యం. వి. రఘునాదరావు, గుంటూరు...2 డిపో. మేనేజర్

షేక్ అబ్దుల్ సలాం, C. I శ్రీమతి సాంబశివ మేడం మరియు స్థానిక ఆర్టీసీ సిబ్బంది, కార్మికులు , పట్టణ సాహితీవేత్తలు, సాహిత్యాభిలాషులు, కళాకారులు అభినందించారు.

ఃఃఃఃఃఃఃఃఃః

ఆళ్ల నాగేశ్వరరావు

(తెనాలి)

7416638823.

ఃఃఃఃఃఃఃఃఃఃః

First Published:  26 Oct 2022 1:15 PM IST
Next Story