Telugu Global
Andhra Pradesh

వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా- జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి

జనంలో చేతగాని వాళ్లుగా మారి తిట్లు తింటూ బతుకుతున్నామన్నామని ఆవేదన వ్య‌క్తం చేశారు జెడ్పీటీసీ గాదె. ఎమ్మార్వో అస్సలు పని చేయడం లేదని, ఆయన్ను మార్చాలని కోరినా ఎమ్మెల్యే వినిపించుకోదన్నారు.

వైసీపీ కోసం 70 ఎకరాలు అమ్ముకున్నా- జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి
X

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే శంక‌ర్‌రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు. వైసీపీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీలో చేరి పూర్తిగా నష్టపోయానన్నారు. వైసీపీ కోసం కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశానన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జెడ్పీటీసీగా గెలిచానని.. పార్టీ కోసం 70 ఎకరాల భూమిని అమ్ముకున్నానని ఆవేదన వ్య‌క్తంచేశారు.

ఇంత చేసినా పార్టీ తనకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు గాదె వెంక‌ట‌రెడ్డి. బోర్ బండి కూడా అమ్మేసుకున్నానన్నారు. తన 35 ఎకరాలు చుక్కల భూమిగా మారిందని, దాన్ని సరిచేయాలని ఎమ్మెల్యేను, ఎంపీని కోరినా న్యాయం చేయడం లేదన్నారు. వీడికి ఆ భూమి వస్తే తిరిగి డబ్బులు వస్తాయి, పార్టీలో హవా చెలాయిస్తారనే కుట్ర‌తో న్యాయం చేయడం లేదన్నారు. ఓటు వేయించిన తమను ప్రజలను నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామన్నారు.

జనంలో చేతగాని వాళ్లుగా మారి తిట్లు తింటూ బతుకుతున్నామన్నామని ఆవేదన వ్య‌క్తం చేశారు జెడ్పీటీసీ గాదె. ఎమ్మార్వో అస్సలు పని చేయడం లేదని, ఆయన్ను మార్చాలని కోరినా ఎమ్మెల్యే వినిపించుకోదన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారినే ప్రోత్సహిస్తున్నారని.. తమలాంటి వారు నిజాయితీగా పనిచేసి నాశనం అయిపోయామన్నారు. అప్పులు తెచ్చి పార్టీ కోసం ఖర్చు పెట్టానని.. ఇప్పుడు అప్పుల వాళ్లు మీద పడుతుంటే పురుగుల మందు తాగి చావాలనిపిస్తోందన్నారు. వాటర్ ట్యాంక్ నిర్మించిన బిల్లుతో పాటు.. బోర్లు వేసిన బిల్లులు కూడా తనకు ఇవ్వడం లేదన్నారు.

First Published:  2 Jan 2023 11:50 AM IST
Next Story