ఆ తేడా వివరించడంకోసం గడప గడపకూ వైసీపీ
టీడీపీ బూటకపు మేనిఫెస్టోతో పోల్చి చెబుతూ జగన్ హయాంలో జరిగిన సంక్షేమాన్ని, జరగబోతున్న కార్యక్రమాలను వివరించి చెబుతారు.
వైసీపీ మేనిఫెస్టో బయటకు వచ్చింది.
కూటమి మేనిఫెస్టో కూడా ఆర్భాటంగా విడుదలైంది.
ఈ రెండిటిని పోల్చి చూసినప్పుడు అమాయకులెవరైనా చంద్రబాబు బుట్టలో పడటం ఖాయం. 2014లో చంద్రబాబు మోసం తెలిసిన వారు మాత్రం కనీసం టీడీపీ మేనిఫెస్టో చూడటానికి కూడా సాహసం చేయరు. మరి కొత్త ఓటర్లు బాబు బుట్టలో పడకుండా ఉండాలంటే, బాబు మోసాలకు ఇంకెవరూ ఆకర్షితులు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి..? ఇంటింటికీ వెళ్లి రెండు మేనిఫెస్టోలను వివరించి చెప్పాలి. కూటమి మేనిఫెస్టోలోని మోసాలను వివరించాలి.
గడప గడపకు వైసీపీ..
మేనిఫెస్టోల్లోని తేడాలను వివరించేందుకు జగన్ కోసం సిద్ధం అనే కార్యక్రమం చేపట్టింది వైసీపీ. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి జరిగిన ఆర్థిక లబ్ధిని వివరిస్తూ వారికి ఓ పత్రాన్ని అందించారు. ఈసారి ప్రతి కుటుంబాన్ని కలసి వైసీపీ మేనిఫెస్టో కాపీని అందిస్తారు. అదే సమయంలో కూటమి మేనిఫెస్టోలో చెప్పిన అలవికాని హామీల గురించి కూడా వారికి వివరిస్తారు.
స్టార్ క్యాంపెయినర్లతోపాటు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లను ఈ కార్యక్రమం కోసం వినియోగించుకోబోతున్నారు వైసీపీ నేతలు. వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీఎం జగన్ నియోజకవర్గాల్లో సభలకు హాజరవుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు స్థానికంగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమంతోపాటు.. నేరుగా ఇంటికి వెళ్లి మేనిఫెస్టో వివరిస్తే అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని అంటున్నారు నేతలు. అందుకే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నారు. టీడీపీ బూటకపు మేనిఫెస్టోతో పోల్చి చెబుతూ జగన్ హయాంలో జరిగిన సంక్షేమాన్ని, జరగబోతున్న కార్యక్రమాలను వివరించి చెబుతారు.