Telugu Global
Andhra Pradesh

ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుంది

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ మంచి పరిణామమేనని, అయితే అంతకంటే ముందే విభజన చట్టం హామీల అమలుకి కేంద్రం చొరవ తీసుకునేలా రాష్ట్రం ఒత్తిడి పెంచాలని చెప్పారు వైవీ సుబ్బారెడ్డి.

ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుంది
X

ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ బాగుపడుతుందని అన్నారు రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టాలని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ మంచి పరిణామమేనని, అయితే అంతకంటే ముందే విభజన చట్టం హామీల అమలుకి కేంద్రం చొరవ తీసుకునేలా రాష్ట్రం ఒత్తిడి పెంచాలని చెప్పారు వైవీ. రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాల్సిందేనని స్పష్టం చేశారు.


నిన్ననే కదా మొదలు పెట్టింది..

ఉచిత ఇసుక విధానంపై వీవీ సుబ్బారెడ్డి సెటైర్లు పేల్చారు. ఇసుక ఉచితం అని ప్రకటించిన మరుసటి రోజే ఏపీలో నిర్మాణాలు భారీగా పెరిగిపోయాయని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అవసరమైన వారికి ఇసుక ఉచితంగా ఇవ్వడం మంచిదే కానీ.. వైసీపీ హయాంలో తప్పులు జరిగాయని చెప్పడం మాత్రం సరికాదన్నారు. ఉచిత ఇసుక అనేది సాధ్యం కాదని, ఇప్పుడు కూడా ఇసుకకోసం చెల్లింపులు జరుగుతున్నాయని అంటే పూర్తి ఉచితం కాదని వివరించారు వైవీ సుబ్బారెడ్డి. ప్రభుత్వంలో ఉంది మీరే కదా.. తప్పులు జరిగాయనుకుంటే విచారణ జరిపించండి అని డిమాండ్ చేశారు.

వైఎస్‌ జగన్‌ రాజీనామా చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. జగన్‌ రాజీనామా చేయరు.. చేయాల్సిన పనిలేదన్నారు. కడప ఉప ఎన్నికలనేవి ఊహాగానాలేనన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఆయ డిమాండ్ చేశారు.

First Published:  10 July 2024 6:51 AM GMT
Next Story