ఐపాక్, ఆరా మస్తాన్ మోసం..మరో వైసీపీ నేత సంచలనం
ఐపాక్ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు నల్లగట్ల. చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం జీర్ణించుకోలేకపోతున్నారు నేతలు. ఓటమికి ఒక్కో నేత ఒక్కో కారణం చెప్తున్నారు. తాజాగా తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు సైతం తన మనసులో మాటను బయటపెట్టారు. ఎన్నికల్లో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఐపాక్ సంస్థ వల్ల నష్టం జరిగిందన్నారు నల్లగట్ల. చాలా మంది నేతలు, కార్యకర్తలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. గతంలో లగడపాటి టీడీపీని ముంచినట్లు ఇప్పుడు ఆరా మస్తాన్ సైతం వైసీపీని ముంచాడన్నారు నల్లగట్ల.
దాదాపు 3 దశాబ్ధాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన స్వామిదాసు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైసీపీలో చేరారు . 1994, 99 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నల్లగట్ల స్వామిదాసు. తెలుగుదేశం అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు.
మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం రెండు రోజుల క్రితం ఐపాక్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ ఓ పనికి మాలిన సంస్థ అని..అందులో ఉన్న వారంతా డిగ్రీలను అడ్డుకుని జగన్ను తప్పుదోవ పట్టించారన్నారు కొట్టు. ఆ సంస్థను నమ్మి ఎన్నికల్లో ఓడిపోయామన్నారు.
YSRC MLA candidate blames I PAC for losses
— Sudhakar Udumula (@sudhakarudumula) June 10, 2024
MLA candidate Nallagatla Swamidasu addresses YCRC leaders in Thiruvuru: "We faced financial setbacks in the elections. Mistakes were made, and the iPac team deceived us. Aara Mastan's also gave wrong reports ." #YSRC… pic.twitter.com/euorrHgHlv