Telugu Global
Andhra Pradesh

కళ్లముందే అభివృద్ధి.. కనపడలేదంటే ఎలా..?

శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన షర్మిలకు ఉద్దానంలో తాము కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీటి ప్రాజెక్ట్ కనపడలేదా? అని ప్రశ్నించారు వైవీ. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా.. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ది కనపడుతుందని అన్నారు.

కళ్లముందే అభివృద్ధి.. కనపడలేదంటే ఎలా..?
X

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విషయంలో వైసీపీ రియాక్షన్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఆమె తొలి అటాక్ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వెంటనే రియాక్ట్ అయ్యారు, కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు మాత్రం చచ్చిపోయిన కాంగ్రెస్ గురించి ఇప్పుడు మాటలేంటని లైట్ తీసుకున్నారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ది బెస్ట్ పాలసీ అనేది విజయసాయి ఆలోచన. అయితే అభివృద్ధి కనపడలేదా అని ప్రశ్నించిన వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ప్రశ్నకు బదులివ్వాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఆయన మరోసారి ఆమె వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. గ్రామ గ్రామాన అభివృద్ధి జరిగింది కనపడటంలేదా అని ప్రశ్నించారు.

టైమ్ మీరు చెప్పినా.. నన్ను చెప్పమన్నా..?

ఇటీవల బస్సులో ప్రయాణిస్తూ షర్మిల సినిమా డైలాగులు కొట్టారు. ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసేందుకు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని, టైమ్ వారు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే.. చేసిన అభివృద్ధి చూపించాలని సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలకు వైవీ బదులిచ్చారు. షర్మిలకు అభివృద్ది చూపడానికి తాము సిద్ధమేనన్నారాయన.

శ్రీకాకుళం పర్యటనకు వెళ్లిన షర్మిలకు ఉద్దానంలో తాము కట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, తాగునీటి ప్రాజెక్ట్ కనపడలేదా? అని ప్రశ్నించారు వైవీ. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా.. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ది కనపడుతుందని అన్నారు. రాజధాని కట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. చంద్రబాబును ప్రశ్నించాల్సిన అంశాలపై తమని నిలదీస్తే ఎలా అని లాజిక్ తీశారు. మొత్తమ్మీద షర్మిల-వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అనుకోకుండా వైసీపీ నేతలే షర్మిలను హైలైట్ చేస్తున్నారనే విషయం తేలిపోయింది.

First Published:  25 Jan 2024 9:33 AM IST
Next Story