అయ్యా.. పీకే నువ్వేమీ పీకలేవు.. పవన్‌పై అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
సినిమాలో ఇంటర్ వెల్ సీన్, క్లైమాక్స్‌లో డైలాగ్‌లు చెప్పడం తప్ప నువ్వేమీ పీకలేవని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేవన్నారు.
వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చెప్పుతో కొడతా, గొంతు పిసుకుతా, తోలు తీస్తా అంటూ పవన్ రెచ్చిపోయి మాట్లాడారు. అయితే పవన్ వ్యాఖ్యలకు దీటుగా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అయ్యా.. పీకే నువ్వేమీ పీకలేవు.. అంటూ వ్యాఖ్యానించారు. సినిమాలో ఇంటర్ వెల్ సీన్, క్లైమాక్స్ లో డైలాగ్ లు చెప్పడం తప్ప నువ్వేమీ పీకలేవన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టచ్ కూడా చేయలేవన్నారు.
రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మేమొస్తే బలం, కలిస్తే బలమని అంటున్నారు.. టీడీపీ, జనసేన రెండు కలసి వస్తే ఆ బలుపు వాపు అన్ని తుంచి వేస్తామన్నారు. ఎవరో డైరెక్షన్‌లో నడుస్తూ స్క్రిప్ట్ చదువుతున్నావ్.. అందులో కొత్తేమీ లేదంటూ పవన్‌పై మండిపడ్డారు.
వైసీపీ నాయకులపై పవన్ చేసిన కామెంట్స్ పట్ల మంత్రి జోగి రమేష్ స్పందించారు. పవన్ కళ్యాణ్‌కు సినిమా షూటింగులు లేనట్టు ఉన్నాయన్నారు. అందుకే మంగళగిరిలో కూర్చొని చంద్రబాబు ఏం చెప్తే అది పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖ గర్జన విజయవంతం కావడం తట్టుకోలేక జనసేన బ్యాచ్ సైకోల్లా వ్యవహరించారన్నారు. పవన్ ఎన్నిసార్లు పొత్తు పెట్టుకుంటారు? ఎన్నిసార్లు విడాకులు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. పవన్ నువ్వు ఒంటరిగా వచ్చినా, టీడీపీ, బీజేపీతో కలిసి వచ్చినా చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు.
మరో మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..'ఇది కదా నీ అసలు రూపం పవన్ కళ్యాణ్' అని ట్వీట్ చేశారు. పీకే అంటే పిచ్చి కుక్క అని, పీకే అంటే ప్యాకేజీ కళ్యాణ్ అని, పీకే అంటే పెళ్లిళ్ల కళ్యాణ్ అని మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు.