Telugu Global
Andhra Pradesh

ఆరోజు ఏం జరిగిందంటే..? అవినాష్ రెడ్డి లేటెస్ట్ వీడియో

వివేకా కుమార్తె, అల్లుడు ఆ లేఖ దాచిపెట్టారని ఆరోపించారు. ప్రసాద్‌ ను ఎవరైనా ఏమైనా అంటారేమో అని లేఖ దాచిపెట్టినట్టు సునీత చెప్పారని, తండ్రికంటే, డ్రైవర్ ప్రసాద్ పై వారికి అంత నమ్మకమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు అవినాష్ రెడ్డి.

ఆరోజు ఏం జరిగిందంటే..? అవినాష్ రెడ్డి లేటెస్ట్ వీడియో
X

ఆరోజు ఏం జరిగిందంటే..? అవినాష్ రెడ్డి లేటెస్ట్ వీడియో

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి సడన్ గా ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ వాయిదాలమీద వాయిదాలు పడుతున్న టైమ్ లో ఓ వీడియోతో బయటకొచ్చారు అవినాష్ రెడ్డి. అసలు వివేకా చనిపోయిన రోజు ఏం జరిగిందంటే.. అంటూ కొన్ని విషయాలను ప్రజలకు వివరించారు.

వివేకా హత్య జరిగిన రోజు ఆయన బామ్మర్ది శివప్రకాష్ రెడ్డి ఉదయం 6.30 గంటలకు తనకు ఫోన్ చేశారని చెప్పారు అవినాష్ రెడ్డి. తాను అప్పటికే జమ్మలమడుగు వెళ్తున్నానని, పులివెందుల రింగ్‌ రోడ్డులో ఉన్నప్పుడు తనకు ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు. వివేకా నో మోర్ అని శివప్రకాష్ రెడ్డి తనకు ఫోన్‌ లో చెప్పారని వివరించారు అవినాష్ రెడ్డి. ఆ ఫోన్ రావడంతో తాను వెంటనే వివేకా ఇంటికి వెళ్లానని అన్నారు. చనిపోవడానికి ముందు వివేకా రాసిన లెటర్‌, ఫోన్‌ గురించి ఆయన పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి చెప్పారని, అయితే ఆ లెటర్‌, ఫోన్‌ ను దాచేయాలని రాజశేఖర్‌ రెడ్డి, వివేకా పీఏకి చెప్పారని అన్నారు అవినాష్ రెడ్డి.

ఆ లేఖలో ఏముందంటే..?

"డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నా డ్రైవర్ నన్ను చచ్చేలా కొట్టాడు. ఈ లెటర్ రాసేందుకు నేను చాలా కష్టపడ్డాను. డ్రైవర్ ప్రసాద్‌ ను వదిలిపెట్టవద్దు". అని ఆ లెటర్ లో వివేకా రాసినట్టు పేర్కొన్నారు అవినాష్ రెడ్డి. వివేకా చివరి మాటలు అవేనన్నారు. డ్రైవర్‌ ప్రసాద్‌ ను వదిలిపెట్టొద్దని లేఖలో వివేకా రాశారని, మర్డర్‌ కేసులో ఆ లెటరే చాలా కీలకం అని, కానీ వివేకా కుమార్తె, అల్లుడు ఆ లేఖ దాచిపెట్టారని ఆరోపించారు. ప్రసాద్‌ ను ఎవరైనా ఏమైనా అంటారేమో అని లేఖ దాచిపెట్టినట్టు సునీత చెప్పారని, తండ్రికంటే, డ్రైవర్ ప్రసాద్ పై వారికి అంత నమ్మకమేంటో తనకు అర్థం కావడంలేదన్నారు అవినాష్ రెడ్డి.

ఆ లెటర్‌ పై సీబీఐ ఎందుకు ఫోకస్ చేయడం లేదన్నారు అవినాష్ రెడ్డి. ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. మర్డర్‌ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారని వివేకా కూతురు, అల్లుడిని ప్రశ్నించారు. వారి వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారని తేల్చి చెప్పారు. అదే విషయాన్ని తాను సీబీఐకి చెప్పానన్నారు అవినాష్ రెడ్డి.

సునీత పదే పదే తన స్టేట్ మెంట్లు మార్చేసిందనేది అవినాష్ రెడ్డి ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసు విచారణను గమనిస్తే.. అవినాష్ రెడ్డి కూడా పదే పదే తన ఆరోపణల సరళిని మార్చినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం వివేకా లెటర్ ని హైలెట్ చేసిన అవినాష్ రెడ్డి గతంలో ఆయన వ్యక్తిగత సంబంధాలను బయటపెట్టారు. ఆ సంబంధాల వల్ల కూడా హత్య జరిగి ఉండొచ్చన్నారు. ఆ తర్వాత ఆస్తికోసమేమోననే అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  27 April 2023 9:53 AM GMT
Next Story