Telugu Global
Andhra Pradesh

తండ్రి, కొడుకులను వెంటాడుతున్నారా?

ఇక్కడే సునీత వైఖరిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. తండ్రిని హత్యచేసిన దస్తగిరి హ్యాపీగా పంచాయితీలు చేసుకుంటూ బయట తిరుగుతుంటే సునీత అసలు పట్టించుకోవటమే లేదు. కానీ వైఎస్ భాస్కరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల బెయిల్‌కు వ్య‌తిరేకంగా మాత్రం గ‌ట్టి పోరాటమే చేస్తున్నారు.

YS Sunitha Reddy: తండ్రి, కొడుకులను వెంటాడుతున్నారా?
X

YS Sunitha Reddy: తండ్రి, కొడుకులను వెంటాడుతున్నారా?

ఏకకాలంలో వైఎస్ సునీతారెడ్డి ఇద్దరిపైన పోరాటంచేస్తున్నారు. ఆ పోరాటం కూడా తండ్రి, కొడుకులు వైఎస్ భాస్కరరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైనే కావటం గమనార్హం. ఇక్కడ విచిత్రం ఏమిటంటే తండ్రిపైన తెలంగాణ హైకోర్టులో పోరాటం చేస్తూనే సుప్రీంకోర్టులో కొడుకు అవినాష్ పైనా పోరాడుతున్నారు. విషయం ఏమిటంటే రెండు రకాల పోరాటాలు బెయిల్‌కు వ్యతిరేకంగా కావటమే ఆశ్చర్యం. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అవినాష్‌కు హైకోర్టు ఇచ్చిన‌ ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఎంపీపైన ఉన్న అభియోగాలన్నీ చాలా తీవ్రమైనవని, బెయిల్ మీద బయట ఉంటే అవినాష్ సాక్ష్యులను ప్రభావితం చేసి, బెదిరిస్తారంటు పిటీషన్‌లో పేర్కొన్నారు. బెయిల్‌ను వ్యతిరేకిస్తు సీబీఐ చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సునీత పిటీషన్‌లో ప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు తీర్పులో లోపాలున్నాయని సునీత తప్పుపట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

ఇక ఇదే విధమైన పోరాటాన్ని హైకోర్టులో చేస్తున్నారు. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ పోరాడుతున్నారు. హత్యలో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా సీబీఐ తనను అరెస్టు చేసినట్లు భాస్కర్ రెడ్డి ఆరోపించారు. భాస్కర్ హైకోర్టులో ఇలా పిటీషన్ వేయటమే ఆలస్యం వెంటనే సునీత అలా ఇంప్లీడ్ అయిపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటు గోల మొదలుపెట్టేశారు. భాస్కర్ చాలా పవర్ ఫుల్ నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పిటీషన్‌లో పేర్కొన్నారు.

ఇక్కడే సునీత వైఖరిపై అందరిలోనూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. తండ్రిని హత్యచేసిన దస్తగిరి హ్యాపీగా పంచాయితీలు చేసుకుంటూ బయట తిరుగుతుంటే సునీత అసలు పట్టించుకోవటమే లేదు. తండ్రి హంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనని పదేపదే ప్రతిజ్ఞ చేస్తున్న సునీత మరి దస్తగిరి బెయిల్ రద్దు చేయాలని ఎందుకు పిటీషన్ వేయలేదో అర్థంకావటం లేదు. పైగా దస్తగిరి బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకించని సీబీఐ మీద కూడా సునీత పిటీషన్ వేయలేదు. ఇక్కడే సునీత డబల్ రోల్‌పై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

First Published:  7 Jun 2023 6:08 AM GMT
Next Story