దొరికిపోయిన షర్మిల.. ఆస్తి కోసమే ఇదంతా..!
కర్నూలులో మీడియాతో మాట్లాడిన షర్మిల.. సోదరుడు జగన్ తనకు అప్పు ఇచ్చారని, అదే విషయాన్ని అఫిడవిట్‌లో చేర్చాను అని చెప్పారు.
కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల అఫిడవిట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తన అన్న జగన్ దగ్గర రూ.82 కోట్ల 58 లక్షలు, వదిన భారతి దగ్గర రూ.19 లక్షల 56 వేలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్‌లో షర్మిల పేర్కొన్నారు. తాజాగా ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన అప్పులపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు షర్మిల.
కర్నూలులో మీడియాతో మాట్లాడిన షర్మిల.. సోదరుడు జగన్ తనకు అప్పు ఇచ్చారని, అదే విషయాన్ని అఫిడవిట్‌లో చేర్చాను అని చెప్పారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "సమాజంలో నిజానికి చెల్లెలికి ఏ అన్న అయినా వాట ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. ఆడబిడ్డకు ఇవ్వాల్సిన హక్కు అన్నకు ఉంది. మేనమామగా కూడా బాధ్యత ఉంది. తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేది మేనమామ కాబట్టి ఇది సహజంగా అందరు పాటించే నియమం".
"కొందరు చెల్లెళ్ళకు ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావిస్తారు. తామేదో చెల్లెలికి గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వాళ్లు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. చెల్లెళ్లక కొసరు ఇచ్చి అదికూడా అప్పు ఇచ్చినట్లు చూపిస్తారు. ఇది వాస్తవం.. ఇది కుటుంబానికి మొత్తం తెలుసు.. దేవుడికి తెలుసు" అంటూ హాట్ కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిల.
జగన్‌తో షర్మిల విభేదించడానికి ఆస్తి తగాదాలే కారణమని ముందునుంచే చర్చ జరుగుతోంది. అయితే తాజాగా షర్మిల వ్యాఖ్యలతో అది స్పష్టమైంది. ఆస్తిలో వాటా కోసమే అన్నతో విభేదించిన షర్మిల.. పైకి మాత్రం ఏదో ఏపీని ఉద్ధరించేందుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుటుంబ సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోకుండా.. రాజకీయాలకు ముడిపెడుతూ జగన్‌ను, ఆయన కుటుంబాన్ని రోడ్డుపైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. షర్మిలను ఏపీ జనం ఎవరూ నమ్మట్లేదు. అందుకే ఫ్రస్టేషన్‌లో జగన్‌పై తీవ్ర స్థాయిలో విషం చిమ్ముతున్నారు షర్మిల.