Telugu Global
Andhra Pradesh

నో పొలిటికల్ కామెంట్స్.. ఓన్లీ వైఎస్ఆర్

రుణ మాఫీ అయినా, ఫీజు రీఎంబర్స్ మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు ఇళ్లు అయినా అది కేవలం వైఎస్ఆర్ తోనే సాధ్యమైందని చెప్పారు వైఎస్ షర్మిల. సీఎం అయిన తర్వాత తొలి సంతకం రైతులకోసమే పెట్టారని అన్నారు.

నో పొలిటికల్ కామెంట్స్.. ఓన్లీ వైఎస్ఆర్
X

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు ఆయన కుమార్తె వైఎస్ షర్మిల. తల్లి విజయమ్మతో కలసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ని సందర్శించారు. కొడుకు, కూతురుతో కలసి షర్మిల, వైఎస్ఆర్ కి నివాళులర్పించారు. అక్కడ ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఓన్లీ వైఎస్ఆర్..

ప్రార్థనల అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఎలాంటి రాజకీ వ్యాఖ్యలు చేయలేదు. కేవలం వైఎస్ఆర్ గొప్పతనాన్ని మాత్రం ఆమె మరోసారి గుర్తు చేశారు. రుణ మాఫీ అయినా, ఫీజు రీఎంబర్స్ మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు ఇళ్లు అయినా అది కేవలం వైఎస్ఆర్ తోనే సాధ్యమైందని చెప్పారు. సీఎం అయిన తర్వాత తొలి సంతకం రైతులకోసమే పెట్టారని అన్నారు. ఐదేళ్లలో 46లక్షల పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారన్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి హృదయాన్ని దోచుకున్న వ్యక్తి వైఎస్ఆర్ అని అన్నారు షర్మిల.

వైఎస్సార్టీపీ అంటూ తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఆ వార్తలను సమర్థించినా, షర్మిల తరపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. అలాగని ఆ వార్తలను ఆమె ఖండించనూ లేదు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ, రాహుల్ గాంధీ పుట్టినరోజుకి షర్మిల శుభాకాంక్షల ట్వీట్ తో ఆమె కాంగ్రెస్ ఎంట్రీ దాదాపు ఖాయమని తేలిపోయింది. కాంగ్రెస్ లో చేరిక వార్తలు బయటకొచ్చాక ప్రజా పోరాటాలు, పాదయాత్రలంటూ బయటకు రావడం కూడా తగ్గించారు షర్మిల. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఈరోజు మీడియా ముందుకొచ్చినా కేవలం వైఎస్ఆర్ గురించి మాత్రమే మాట్లాడారు. ఎక్కడా పొలిటికల్ కామెంట్లు చేయలేదు.

First Published:  8 July 2023 1:04 PM IST
Next Story