వైఎస్ భాస్కర్ రెడ్డి కి నో బెయిల్
ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. సీబీఐ వాదనతో అంగీకరించింది.
వైఎస్ వివేకా హత్యకేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం, సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకి తరలించారు. అనారోగ్యం కారణంగా ఆయనకు మధ్యలో కొన్నిసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే తనకు బెయిల్ ఇప్పించాలని ఇటీవల భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యం దృష్ట్యా తనకు బెయిల్ ఇప్పించాలన్నారు. ఆయన బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భాస్కర్ రెడ్డి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, ఆయన్ను అరెస్టు చేసినప్పుడు కడపలో జరిగిన ధర్నాలు, ప్రదర్శనలే భాస్కర్ రెడ్డి బలానికి నిదర్శనని సీబీఐ తెలిపింది.
ఇరు వర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. సీబీఐ వాదనతో అంగీకరించింది. మరోవైపు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో వైఎస్ వివేకా కుమార్తె సునీత సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరగాల్సి ఉంది.