Telugu Global
Andhra Pradesh

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో ట్విస్ట్‌.. యూట్యూబర్‌ నాని అరెస్టు!

యూట్యూబర్ నానికి, బాలాజీ అనే వ్యక్తికి నిన్న రాత్రి ఒకటో నెంబర్ జెట్టిలో గొడవ జరిగిందని, ఆ గొడవే ప్రమాదానికి దారి తీసి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాదంలో ట్విస్ట్‌.. యూట్యూబర్‌ నాని అరెస్టు!
X

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌అగ్ని ప్రమాదంలో కొత్తకోణం వెలుగు చూసింది. తాజాగా యూట్యూబర్ లోకల్‌ బాయ్‌ నానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం నాని తన భార్య సీమంతం వేడుకలు నిర్వహించాడు. ఈ నేపథ్యంలోనే రాత్రి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. అయితే పార్టీ మధ్యలో నానికి, బాలాజీ అనే వ్యక్తికి ఒకటో నెంబర్‌ జెట్టిలో గొడవ జరిగింది. ఈ గొడవే ప్రమాదానికి దారి తీసి ఉంటుంద‌ని అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూట్యూబర్ నానికి, బాలాజీ అనే వ్యక్తికి నిన్న రాత్రి ఒకటో నెంబర్ జెట్టిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. నాని తన బోటుని అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసిన బాలాజీ అడ్వాన్స్ గా కొంత సొమ్ము ఇచ్చాడు. అయితే ఇచ్చిన అడ్వాన్స్‌ను బాలాజీ తిరిగి అడగడమే ఇద్దరి మధ్య గొడవకి దారి తీసిందని తెలుస్తోంది. దీంతో మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో సుమారు 50కిపైగా బోట్లు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.


First Published:  20 Nov 2023 3:56 PM IST
Next Story