పిల్లలు తగ్గటానికీ జగనే కారణమట...ఎల్లోమీడియా పైత్యం
వాస్తవాలు ఇలాగుంటే అనేక కారణాల్లో జగన్ అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించటం కూడా ఒక కారణంగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ మీద బురదచల్లటానికి ఎల్లోమీడియాకు అనేక అవకాశాలున్నాయి.
జగన్మోహన్ రెడ్డి అంటే ఎల్లో మీడియాకు ఎంతమంటుందో అందరికీ తెలుసు. కానీ, సంబంధంలేని విషయాల్లో కూడా జగన్‌ను లాగేసి బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకోవటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఎల్లోమీడియాలో మొదటిపేజీలో 'తరం తరిగిపోతోంది' అనే హెడ్డింగ్ తో ఒక బ్యానర్ స్టోరీ వచ్చింది. ఆ స్టోరీలో సదరు ఎల్లోమీడియా చెప్పిందేమంటే చాలా రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పిల్లలు, యువత సంఖ్య తగ్గిపోతోందని, ఇందుకు చెప్పిన అనేక కారణాల్లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించేయటం కూడా ఒక కారణమట.
ఒక రాష్ట్రంలో చిన్నపిల్లలు, యువత సంఖ్య తగ్గిపోతోందన్నా.. లేకపోతే జనాభా శాతం తగ్గిపోతోందన్నా అనేక కారణాలుంటాయి. ఇలాంటి విషయాల్లో ప్రధానంగా సామాజిక, ఆర్థిక కారణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు గంపెడుమంది సంతానం కావాలనుకునేవారు. కానీ మారిన పరిస్థితుల్లో ఇద్దరుచాలాని ఇప్పుడైతే ఒక్కరు చాలని అనుకుంటున్నారు. ఎక్కువమంది పిల్లల్ని కనే ఓపిక లేకపోవటం, అనారోగ్యాలు, ఆర్థిక పరిస్ధితులు ఇలా అనేక కారణాలుంటాయి. అందుకనే ఎక్కువమంది దంపతులు ఒక సంతానంతోనే సరిపెట్టేసుకుంటున్నారు.
ఈ కారణంతో సహజంగానే చిన్నపిల్లలు, యువత సంఖ్య తగ్గిపోతుంది. వాస్తవాలు ఇలాగుంటే అనేక కారణాల్లో జగన్ అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించటం కూడా ఒక కారణంగా చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ మీద బురదచల్లటానికి ఎల్లోమీడియాకు అనేక అవకాశాలున్నాయి. వాటిని పక్కనపెట్టేసి జనాభా తగ్గుదలకు జగన్ పాలనకు లింకుపెట్టటమే విచిత్రం. చంద్రబాబునాయుడు హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని ఉద్దేశ్యంతో ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలను వదిలేసి అమరావతికి తిరిగొచ్చేశారట.
విదేశాలనుండి, ఇతర ప్రాంతాల నుండి తిరిగొచ్చేయటంతో చంద్రబాబు హయాంలో అమరావతి పిల్లాపాపలు, యువతతో కళకళలాడిందన్నట్లుగా రాసుకొచ్చారు. అయితే 2019లో జగన్ అధికారంలోకి రాగానే అమరావతిని దెబ్బతీశారట. దాంతో విదేశాలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళంతా పిల్లల భవిష్యత్ దెబ్బతింటున్న ఉద్దేశ్యంతో తిరిగి బయటకు వెళిపోయారట. దాంతో ఏపీలో చిన్నపిల్లలు, యువత సంఖ్య తగ్గిపోయి ముసలి వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందట. ఈ స్టోరీని చదివితే ఎల్లోమీడియా పైత్యం ఏస్ధాయికి చేరుకున్నదో అర్ధమైపోతోంది.