Telugu Global
Andhra Pradesh

వీర్రాజుపై కసి తీర్చుకున్న ఎల్లో మీడియా

చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారన్న ఏకైక కారణంతోనే వీర్రాజును ఎల్లో మీడియా బాగా టార్గెట్ చేసింది. ఆ విషయాన్ని దాచిపెట్టి వీర్రాజును నియమించుండకూడదు, నియమించినా కంటిన్యూ చేసుండకూడదని బురదచల్లేసింది.

వీర్రాజుపై కసి తీర్చుకున్న ఎల్లో మీడియా
X

బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఎల్లో మీడియాలో పేరుకుపోయిన కసంతా బయటపడింది. ప్రతి ఆదివారం అచ్చేసే విశ్లేషణలో ఈ విషయం స్పష్టంగా తెలిసింది. ఇందులో ఏమన్నారంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దుస్ధితి బయటపడిందట. తెలంగాణలో మంచి ఊపుమీదున్న బండి సంజయ్‌ను కదాని మృధు స్వభావి అయిన కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమిచంటం తప్పట. అసలు అధ్యక్షుల మార్పే అసంబంద్ధమని ఎల్లో మీడియా తేల్చేసింది. ఇదే ఏపీ విషయానికి వచ్చేసరికి తన టోన్ మారిపోయింది.

కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా మార్చటమే అగ్రనేతలు చేసిన తప్పట. ఒకవేళ మార్చినా సోము వీర్రాజును నియమించటం ఇంకా తప్పన్నది. ఒకవేళ నియమించినా ఇంతకాలం కంటిన్యూ చేసుండకూడదని అభిప్రాయపడింది. వీర్రాజు నాయకత్వంలో పార్టీ ఏ రకంగా కూడా బలోపేతం కాలేదట. ఇక్కడే వీర్రాజుపైన తనకున్న కసంతా ఎల్లో మీడియా యాజమాన్యం బయటపెట్టుకుంది. నిజానికి ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటే. అధ్యక్షుడిగా కన్నా ఉన్నప్పుడు పార్టీ ఏమన్నా బలపడిందా?

అధ్యక్షుడి హోదాలో నరసరావుపేట ఎంపీగా పోటీ చేస్తే కన్నాకు వచ్చిన ఓట్లు 15 వేలు. కనీసం డిపాజిట్‌ కూడా తెచ్చుకోలేకపోయిన కన్నా కెపాసిటి ఏమిటో అప్పుడే బయటపడింది. కాపు నేతను అని చెప్పుకునే కన్నా బీజేపీలోకి ఒక్క కాపు ప్రముఖుడిని కూడా చేర్చలేకపోయారు. ఇక వీర్రాజు కెపాసిటి కూడా సేమ్ టు సేమ్. అయితే ఇద్దరిలో ఒక తేడా ఉంది. అదేమిటంటే కన్నా పదవిలో ఉన్నంతకాలం చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాకు అనుకూలంగా వ్యవహరించారు. వ్యక్తిగత ద్వేషంతో జగన్మోహన్ రెడ్డిపై తరచూ విరుచుకుపడేవారు.

అదే వీర్రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఒక వైపు చంద్రబాబు, మరో వైపు ఎల్లో మీడియాను ఉతికారేసేవారు. చంద్రబాబుతో పొత్తును పూర్తిగా వ్యతిరేకించారు. తనపైన ఎల్లో మీడియాలో నెగిటివ్‌గా వచ్చే వార్తలపై తీవ్రస్థాయిలో మండిపడేవారు. దీంతో ఎల్లో మీడియాకు వీర్రాజుపై మండిపోయింది. అందుకనే కావాలనే పదేపదే వీర్రాజును టార్గెట్ చేస్తూ నెగిటివ్ వార్తలు రాసేవారు. చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారన్న ఏకైక కారణంతోనే వీర్రాజును ఎల్లో మీడియా బాగా టార్గెట్ చేసింది. ఆ విషయాన్ని దాచిపెట్టి వీర్రాజును నియమించుండకూడదు, నియమించినా కంటిన్యూ చేసుండకూడదని బురదచల్లేసింది. మరి ఇప్పుడు అపాయింటైన దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.

First Published:  9 July 2023 5:09 AM GMT
Next Story