లోకేశ్‌తో పవన్‌కు పోలిక.. జనసేనాని టార్గెట్‌గా కుట్రలు..!
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే జనసేనకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసైనికుల కోరిక.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ టార్గెట్‌గా మళ్లీ టీడీపీ అనుకూల మీడియా కుట్రలు స్టార్ట్ చేసింది. పవన్‌కల్యాణ్‌ను ప్రజలకు వీలైనంత తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తద్వారా పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్‌కు వీలైనంత తక్కువ సీట్లు కేటాయించినా న్యాయమే అన్నట్లు కుట్రలకు తెరలేపింది.
తాజాగా పవన్‌కల్యాణ్‌ను నారా లోకేశ్‌తో పోల్చుతోంది పచ్చమీడియా. లోకేశ్ జనంలో ఉంటున్నాడని, చాలా బాగా కష్టపడుతున్నాడంటూ లోకేశ్‌ను ఆకాశానికి ఎత్తుతోంది. పవన్‌కల్యాణ్ మాత్రం జనం మధ్యలోకి రావట్లేదంటూ పెద్దగా పోరాడడం లేదన్నట్లుగా ప్రచారం మొదలుపెట్టింది. క్షేత్రస్థాయిలో లోకేశ్ కష్టపడుతున్నట్లుగా పవన్ కష్టపడట్లేదని వార్తలను వండివార్చుతోంది. ఇక పచ్చమీడియా రాతలపై జనసైనికులు మండిపడుతున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తెలుగుదేశం, జనసేన పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే జనసేనకు 50కి పైగా సీట్లు కేటాయించాలని జనసైనికుల కోరిక. కానీ, జనసేకు 20-25 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు తెలుగుదేశంలో లోలోపల కుట్రలు చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక తెలుగుదేశం అనుకూల మీడియాలో వస్తున్న వార్తలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఉంది.