Telugu Global
Andhra Pradesh

ఏపీ సీఎస్ బదిలీ అంటూ ఎల్లో మీడియా కడుపుమంట వార్తలు

సీఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్. వీరి ఆరోపణల ఆధాంగా సీఎస్ పై బదిలీ వేటు పడుతుందని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.

ఏపీ సీఎస్ బదిలీ అంటూ ఎల్లో మీడియా కడుపుమంట వార్తలు
X

ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీ విషయంలో మొదటి నుంచీ టీడీపీకి, ఎల్లో మీడియాకు కడుపుమంటగానే ఉంది. ఎన్నికల వేళ పదే పదే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదులు చేసి డీజీపీని బదిలీ చేయించారు. ఇక మిగిలింది సీఎస్. ఆయన్ను కూడా బదిలీ చేయించాలని తెగ తాపత్రయ పడుతున్నారు. ప్రతి రోజూ బురదజల్లే కార్యక్రమం ఇటీవల ఉధృతం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయనపై బదిలీ వేటు పడుతోందంటూ వార్తల్ని వండి వార్చారు.

బదిలీ ఎందుకు..?

ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, వైసీపీకి వంతపాడుతున్నారనేది టీడీపీ ప్రధాన ఆరోపణ. ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి ఈసీకి లేఖ రాశారు టీడీపీ నేతలు. కౌంటింగ్ స్వేచ్చాయుతంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే ఈసీని బదిలీ చేయాలని వారు కోరారు. సీఎస్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్. వీరి ఆరోపణల ఆధాంగా సీఎస్ పై బదిలీ వేటు పడుతుందని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది.

ఇటీవల ఉత్తరాంధ్ర భూముల కుంభకోణం అంటూ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు కూటమి నేతలు. సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఈ కుంభకోణంలో కీలక పాత్ర వహించారని అంటున్నారు. వారి ఆరోపణలకు ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది ఎల్లో మీడియా. ఈ వివాదం కూడా ఈసీ దృష్టికి వెళ్లిందని, అందుకే కౌంటింగ్ కి ముందే సీఎస్ పై బదిలీ వేటు పడుతుందని వారు అంటున్నారు. సీఎస్ బదిలీ అయిపోయినట్టేనని తీర్మానించేసింది ఎల్లో మీడియా.

First Published:  27 May 2024 9:43 PM IST
Next Story