అన్న క్యాంటీన్లపై అయ్యోపాపం.. జగన్ ఫొటోలంటే ఎక్కడలేని ద్వేషం
ఎన్నికల కోడ్ వస్తే కచ్చితంగా విగ్రహాలపై ముసుగు పడుతుంది, ప్రభుత్వ కార్యాలయాల్లోని నాయకుల ఫొటోలపై తెల్ల పేపర్లు అంటిస్తారు. ఇది ప్రతి ఎన్నికల ముందు జరిగే ప్రక్రియే. అయితే ఈసారి మాత్రం ఎల్లో మీడియా పనిగట్టుకుని ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తోంది.
ఎన్నికల కోడ్ పేరు చెప్పి పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసేస్తున్నారంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. అదే సమయంలో జగన్ ఫొటోలతో ఉన్న క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ల పంపిణీ సరికాదనే వార్తల్ని కూడా ఇస్తోంది. అంటే వారి ఉద్దేశమేంటి..? టీడీపీ ప్రలోభాలకు మాత్రం అధికారులు ఏమాత్రం అడ్డుచెప్పకూడదు, జగన్ ఫొటోలు కనపడితే మాత్రం అది కోడ్ ఉల్లంఘించినట్టు. ఇదే ఎల్లో మీడియా లెక్క. ఇలాంటి కక్షపూరిత వార్తల్ని ప్రజలు అర్థంచేసుకోలేరు అనుకోవడం మాత్రం వారి భ్రమ.
విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను అధికారులు తొలగించాలన్నారని, నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్ కు కోడ్ అడ్డంకి ఏంటని ప్రశ్నిస్తోంది ఎల్లో మీడియా. ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. అన్న క్యాంటీన్ ని ఉన్నఫళంగా తొలగించాలని అధికారులు చెప్పలేదు, కొనసాగించాలనుకుంటే స్థానిక టీడీపీ నేతల అకౌంట్లో దాన్ని ఎన్నికల ఖర్చుగా రాసుకుంటామని మాత్రమే స్పష్టం చేశారు. అలా ఖర్చు రాయడం ఇష్టం లేని టీడీపీ నేతలు అన్నక్యాంటీన్ ఎత్తేయాలని నిర్ణయించారు. పనిలో పనిగా ఆ నిందను ప్రభుత్వంపై వేసేశారు.
ఏపీలో ప్రస్తుతం అన్న క్యాంటీన్ల నిర్వహణ పొలిటికల్ స్టంట్ లో భాగమేనని చెప్పాలి. ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచీ ఆశావహులు తమ తమ నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు తెరిచారు, మెడికల్ క్యాంపులు మొదలు పెట్టారు, ఆంబులెన్స్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టే నాయకులు ఏ పార్టీకి చెందినవారయినా.. కోడ్ మొదలయ్యాయక వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అయితే అన్న క్యాంటీన్ విషయంలో మాత్రం కక్షసాధింపు అంటూ టీడీపీ రాద్ధాంతం చేయడమే ఇక్కడ కొసమెరుపు.
ఇదే ఎల్లో మీడియా సీఎం జగన్ ఫొటోలతో ఉన్న స్కూల్ బ్యాగ్ లు, నోట్ బుక్స్, బెల్ట్ లు, చిక్కీ కవర్లపై ఎంత రాద్ధాంతం చేస్తుందో చూస్తూనే ఉన్నాం. జగన్ కి ప్రచార యావ ఎక్కువైందని, అన్నిటిపై తన ఫొటోలు వేసుకుంటున్నారని కూడా వెటకారం చేస్తోంది ఎల్లో మీడియా. ఎన్నికల కోడ్ వస్తే కచ్చితంగా విగ్రహాలపై ముసుగు పడుతుంది, ప్రభుత్వ కార్యాలయాల్లోని నాయకుల ఫొటోలపై తెల్ల పేపర్లు అంటిస్తారు. ఇది ప్రతి ఎన్నికల ముందు జరిగే ప్రక్రియే. అయితే ఈసారి మాత్రం ఎల్లో మీడియా పనిగట్టుకుని ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తోంది.