Telugu Global
Andhra Pradesh

జగన్‌ వద్దనుకున్నారు.. అయినా ఇదేం గోల రామోజీరావు..?

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాగుంట శ్రీనివాసులు రెడ్డిని విచారించింది.

జగన్‌ వద్దనుకున్నారు.. అయినా ఇదేం గోల రామోజీరావు..?
X

ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి తిరిగి టికెట్‌ ఇవ్వడానికి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిరాకరించారు. మాగుంటకు టికెట్‌ ఇవ్వాలని పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి వైఎస్‌ జగన్‌ను పదే పదే కోరుతూ వచ్చారు. అయినా శ్రీనివాసులు రెడ్డికి టికెట్‌ ఇవ్వడానికి జగన్‌ ఇష్టపడలేదు. దానివల్లనే కదా, శ్రీనివాసులు రెడ్డి వైసీపీని వీడుతోంది? దాన్ని కప్పిపుచ్చి రామోజీరావు ఈనాడు దినపత్రిక ‘వైకాపాకు మరో షాక్‌... ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా’ అనే శీర్షిక పెట్టింది. ఇది ఎంత వరకు న్యాయం రామోజీరావు గారూ..?

మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఇరుక్కున్నారు. ఈ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాగుంట శ్రీనివాసులు రెడ్డిని విచారించింది. ఆయన కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు కూడా చేసింది. ఆయన బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నారు. తన కుమారుడిని ఒంగోలు సీటు నుంచి పోటీకి దించుదామని అనుకున్నట్లు శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుతం చెప్పుతున్నారు.

ఈ పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. అదేదో జరగరానిది, జరిగినట్లు వైకాపాకు షాక్‌ అంటూ ఈనాడు శీర్షిక పెట్టడం వెనక అంతర్యాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. జగన్‌ మీద కక్ష తీర్చుకోవడానికి ఈ చిన్న అవకాశాన్ని కూడా రామోజీరావు వదిలిపెట్టడం లేదు. ఇదీ అంతే...

First Published:  28 Feb 2024 6:14 AM GMT
Next Story