ఏలూరు పిలుస్తోంది.. రండి.. రండి..!
జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని విధాలా లాభపడిన, బిడ్డల్ని హాయిగా చదివించుకున్న, పెన్షన్లూ, ఇతర పథకాలు డబ్బూ అందుకున్న వారందరూ రేపు తరలివస్తున్నారు.
ఏలూరు.. నిజానికది ఏర్లూరు. అటు తమ్మిలేరు, ఇటు బుడమేరు, ఆ పక్క కృష్ణకాల్వ, ఎటుచూసినా పారేనీరు.. అందుకే అది ఏలూరు అయింది. రేపు, ఫిబ్రవరి 3, శనివారం అక్కడ సీఎం జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరగబోతోంది. ఎందుకంత హడావిడి..? ఎందుకంత పెద్ద పెద్ద ఏర్పాట్లు..?
కారణం ఉంది.. నిన్ను దింపేస్తా అని గొంతు పెంచి అరుస్తున్నాడు చంద్రబాబు. బట్ట విప్పికొడతాం కొడకల్లారా.. అంటున్నాడు పవన్ కల్యాణ్. ఇదేం పరిపాలన, నిన్ను గద్దె దింపేదాకా ఊరుకోం అంటోంది బీజేపీ పురందేశ్వరి, జగన్‌పై ఈ ముప్పేట దాడి చాలదన్నట్టు, ఘనత వహించిన చెల్లెమ్మ షర్మిల తగుదునమ్మా అంటూ సొంత అన్నని తిట్టిపోస్తుంది..! జగన్ మీద పోరాటానికి బాబు అందర్ని కూడగడుతున్నాడు. కోట్ల రూపాయలు వెదజల్లి కొనుగోళ్లు చేస్తున్నాడు. ‘సాక్షి’లో సగం నాది, నా ఆస్తి అంటున్నారు షర్మిలా మేడమ్.
విపక్షాల విషపూరితమైన ఈ దాడికి జవాబు చెప్పాలిగా..! వాళ్లు తిడుతున్నారు. బండెడు బురద చల్లుతున్నారు. రాళ్లు పుచ్చుకుని కొడుతున్నారు. దీనికి సమాధానం చెప్పి తీరాలి. ఒకపక్క ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. జగన్ గొంతు విప్పాలి. తనేం చేశాడో స్పష్టంగా చెప్పాలి. అదే రేపటి ఏలూరు–దెందులూరు బహిరంగ సభ. ఒకటి రెండూ కాదు, ఏకంగా 25 ఎకరాల్లో విస్తరించిన సభ. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని అనేక నియోజకవర్గాల నుంచి జనం కదిలి వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ హాజరవుతున్న సభ, అచ్చూ భీమ్లీ సభలాగే లక్షల జనంతో కిటకిటలాడుతుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభలన్నీ ఒక ఎత్తు. ఒక్క ఏలూరు సభే ఒక హిమాలయం అంత ఎత్తు. అక్కడ జగన్ ఏం మాట్లాడబోతున్నాడు..? లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాననీ, జన సంక్షేమం కోసం కోట్ల రూపాయలు బడుగులకు క్రమం తప్పకుండా అందజేయగలుగుతున్నాననీ చెబుతాడు. అది సహజం.
కెరటాలు కెరటాలుగా కదిలివచ్చిన జనంతో కళకళలాడే ఆ ఒక్క సభ చాలు, చంద్రబాబు గుండెలు జారిపోవడానికి..! పవన్‌కి చల్లని సాయం కాలమే ఒంటి నిండా చెమటలు పట్టడానికి..! షర్మిలకు మాట పడిపోవడానికి.. అదీ జగన్ వ్యూహం..!
జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని విధాలా లాభపడిన, బిడ్డల్ని హాయిగా చదివించుకున్న, పెన్షన్లూ, ఇతర పథకాలు డబ్బూ అందుకున్న వారందరూ రేపు తరలివస్తున్నారు. తమ నాయకుణ్ణి చూడ్డానికి, జీవితాల్లో కొత్త వెలుగులు పూయించిన ‘అన్న’కి ఒక దండం పెట్టుకోడానికి.. మళ్లీ నిన్నే గెలిపిస్తాం మా రాజశేఖరరెడ్డి పుత్రుడా అని నొక్కి చెప్పడానికి..! మేమంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం అని ముక్తకంఠంతో ప్రతినపూనడానికి..!
అందుకే.. ఏలూరు–దెందులూరు సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గొప్ప మలుపు. జగన్‌కి గెలుపు.. అంటే స్వీట్ రివేంజ్‌కి సిద్ధం..!