ఆపరేషన్ పిఠాపురం.. వైసీపీ స్పెషల్ ఫోకస్
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.

జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ వైసీపీ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్‌ను ఓడించిన వైసీపీ.. మరోసారి పవన్‌ను ఓడించాలని చూస్తోంది. ఇందులో భాగంగా అస్త్రాలు సిద్ధం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్.
ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు ఇన్‌ఛార్జిలను నియమించారు జగన్. గొల్లప్రోలు మండలానికి ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు, యు.కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాను సమన్వయకర్తగా పంపుతున్నారు. ఇప్పటికే వీరంతా రంగంలోకి దిగారు.
ఇవాళ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, పిఠాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నేతలు జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. 2019లో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన టికెట్‌పై పోటీ చేసిన శేషు కుమారి, రాధా - రంగా మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా నేతలకు కీలక సూచనలు చేశారు జగన్. ప్రతిపక్షానికి ఎలాంటి స్కోప్ ఇవ్వకూడదని.. పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.