టీడీపీ పౌరుషం ఇప్పటికే రూ.91 వేలు తీసుకుంది..
ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వచ్చిన సమయంలో ఇంటిపై టీడీపీ జెండా కట్టుకుని.. మీ పథకాలేవీ మాకొద్దని చెప్పిన టీడీపీ కార్యకర్త శివయ్య డేటాను వైసీపీ బయటపెట్టింది.
ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వచ్చిన సమయంలో ఇంటిపై టీడీపీ జెండా కట్టుకుని.. మీ పథకాలేవీ మాకొద్దని చెప్పిన టీడీపీ కార్యకర్త శివయ్య డేటాను వైసీపీ బయటపెట్టింది. శివయ్య ప్రభుత్వ పథకాలను తిరస్కరించిన వైనాన్ని టీడీపీ మీడియా బాగానే హైలెట్ చేసింది.
అయితే శివయ్య ఇప్పుడు పౌరుషానికి పోతున్నారు గానీ.. ఆయనకు ఇప్పటికే పథకాల ద్వారా రూ.91 వేలు అందాయని.. వైసీపీ ఆ వివరాలను వెల్లడించింది. జగనన్న విద్యా దీవెన కింద రూ.10 వేలు, వైఎస్‌ఆర్ రైతు భరోసా కింద రూ.40 వేలు, వైఎస్‌ఆర్ పంటల బీమా ద్వారా రూ.1,452, వసతి దీవెన కింద రూ.10 వేలు, వైఎస్‌ఆర్ రైతు సున్నా వడ్డీ ద్వారా రూ.4,121, డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ కింద రూ.2,900... ఇలా మొత్తం శివయ్య కుటుంబానికి మూడేళ్లలో 91 వేల 775 రూపాయలు అందాయి.
పథకాలే అవసరలేదన్న శివయ్య మరి ఈ మూడేళ్లలో తీసుకున్న సొమ్ము వెనక్కు ఇస్తారా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. పథకాలు తమకు వద్దంటూ శివయ్య చెప్పేసిన నేపథ్యంలో ఇకపై ఆయన కుటుంబాన్ని పథకాల లబ్దిదారుల జాబితాలో చేర్చి బాధపెట్టవద్దని వలంటీర్‌ను, అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. శివయ్య పరిస్థితి పౌరుషానికి వెళ్లి కత్తులు మింగినట్టుగా ఉందని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు.