బాబు సూపర్ సిక్స్‌పై విజయసాయిరెడ్డి సెటైర్లు
చంద్రబాబు చెప్తున్న సూపర్ సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావన్నారు విజయసాయిరెడ్డి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు టార్గెట్‌గా మరోసారి సెటైర్లు వేశారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు విజయసాయిరెడ్డి కొత్త అర్థం చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.
చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అంటూ ఏవో పేర్లు చెబుతున్నాడు. సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావు. పొరపాటున గెలిస్తే తాను, తన పుత్రరత్నం లోకేశ్, వదిన పురంధేశ్వరి, యనమల రామకృష్ణుడు, పొంగూరు నారాయణ, నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్‌లు చక్రం తిప్పుతారని సంకేతం ఇస్తున్నారు. వీళ్లు ఆరుగురు బాగు…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 8, 2024
చంద్రబాబు చెప్తున్న సూపర్ సిక్స్ అనేవి సంక్షేమ పథకాలు కావన్నారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు పొరపాటున గెలిస్తే.. తాను, తన పుత్రరత్నం లోకేశ్, వదిన పురందేశ్వరి, యనమల రామకృష్ణుడు, పొంగూరు నారాయణ, నిమ్మగడ్డ రమేష్ చక్రం తిప్పుతారన్నారు. వీళ్లు ఆరుగురు బాగుపడితే చాలనేదే బాబు కోరిక అన్నారు విజయసాయిరెడ్డి.