Telugu Global
Andhra Pradesh

ఐటీ ఉద్యోగులా..పెయిడ్ ఆర్టిస్టులా..? విజయసాయిరెడ్డి ట్వీట్

నైపుణ్య నేరస్తుడు చంద్రబాబు అరెస్టుకు బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసన అంటూ పచ్చ కుల మీడియా హోరోత్తిస్తోందని..వీరు నిజంగా ఐటీ ఉద్యోగుల్లా ఉన్నారా అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు.

ఐటీ ఉద్యోగులా..పెయిడ్ ఆర్టిస్టులా..? విజయసాయిరెడ్డి ట్వీట్
X

స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నిరసన తెలపడంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. నైపుణ్య నేరస్తుడు చంద్రబాబు అరెస్టుకు బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసన అంటూ పచ్చ కుల మీడియా హోరోత్తిస్తోందని..వీరు నిజంగా ఐటీ ఉద్యోగుల్లా ఉన్నారా అంటూ ట్వీట్‌లో ప్రశ్నించారు. టీడీపీ పెయిడ్‌ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారే అంటూ సెటైర్‌ వేశారు.

ఇక మరో ట్వీట్‌లో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు చంద్రబాబుకు మద్దతుగా లోకేష్‌కు ఫోన్ చేస్తున్నారన్నారు విజయసాయి. ఇండియా కూటమిలో టీడీపీ భాగమని చెప్పడానికి ఇదే సాక్ష్యామన్నారు. ఈ పార్టీలన్నింటిది ఓకే స్ట్రాటజీ అని...అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేయడమేనన్నారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే కెపాసిటీ టీడీపీకి లేదన్నారు విజయసాయిరెడ్డి.

చంద్రబాబు అరెస్టయిన నాటి నుంచి తెలుగుదేశంపై వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు విజయసాయి రెడ్డి. శుక్రవారం చేసిన ట్వీట్‌ కూడా చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికలు వైసీపీ వర్సెస్‌ టీడీపీగా జరుగుతాయన్నారు. ఈ పోరును గుంట నక్కల గుంపు వర్సెస్ సింహంగా పోల్చారు విజయసాయి. రాబోయే ఎన్నికలు అధికార వాంఛ వర్సెస్‌ ప్రజా సంక్షేమం, అస్థిరత వర్సెస్ స్థిరమైన ప్రభుత్వం, అవకాశవాదం వర్సెస్‌ నిజాయితీ, కుల రాజకీయం వర్సెస్‌ యూనిటీ మధ్య జరుగుతాయన్నారు.


First Published:  16 Sept 2023 2:08 PM IST
Next Story