Telugu Global
Andhra Pradesh

శ్రీ‌శైల మల్ల‌న్న‌కు స్వ‌ర్ణ ర‌థ వైభోగం

వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంప‌తులు 11 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వ‌ర్ణ రథం తయారు చేయించారు. రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పించారు.

శ్రీ‌శైల మల్ల‌న్న‌కు స్వ‌ర్ణ ర‌థ వైభోగం
X

శ‌ర‌వేగంగా అభివృద్ధి చెందుతున్న శ్రీ‌శైలం దేవ‌స్థానంలో మ‌రో విశేషం. ఈ క్షేత్రంలో స్వ‌యంభువుగా కొలువై ఉన్న మ‌ల్లికార్జున‌స్వామి ఇక‌పై స్వ‌ర్ణ ర‌థంపై ఊరేగ‌బోతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతి దంపతులు స్వర్ణ రథం తయారు చేయించి, శ్రీ‌శైల మ‌ల‌న్న‌కు స‌మ‌ర్పించారు.

రూ.11 కోట్ల‌తో త‌యారీ

శ్రీశైలం దేవస్థానంలో ఇప్పటివరకు స్వామి, అమ్మవార్ల ఉత్స‌వ మూర్తుల‌ను వెండిరథంపైనే ఊరేగిస్తున్నారు. కాగా, వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి దంప‌తులు 11 కోట్ల రూపాయ‌ల‌ వ్యయంతో 23.6 అడుగుల ఎత్తుతో స్వ‌ర్ణ రథం తయారు చేయించారు.

రథసప్తమి సందర్భంగా శుక్రవారం మల్లన్నకు కానుకగా సమర్పించారు. సంప్రోక్షణ అనంతరం రథశాల నుంచి నంది గుడి వరకు స్వర్ణ రథోత్సవం జరగనుంది. బంగారు రథం మధ్యలో పార్వతీ పరమేశ్వరులు, గణపతి, కుమారస్వామి మూర్తులు కొలువుదీరాయి. స్వామి, అమ్మవార్ల చుట్టూ అష్టదిక్పాలకులు, ముందుభాగంలో రెండు పెద్ద అశ్వాలు స్వారీ చేస్తున్నట్లుగా ర‌థాన్ని తీర్చిదిద్దారు.

First Published:  16 Feb 2024 9:04 AM GMT
Next Story